Friday, December 16, 2011

కాగితపు గుజ్జుతో కళాకృతులు

chinthalaagdish 
రంగు, రంగుల కాగితాల ముక్కలను ఒకదానిపై మరొకదాన్ని అందమైన ఆకృతులను సృష్టించే రీతిలో అంటించడాన్ని పర్‌ కొలేజస్‌ అంటారు. సాధారణంగా ఇలాంటి కొలేజస్‌ బల్లపరుపుగా ఉంటాయి. కానీ జగదీష్‌ కొలేజస్‌ వీటికి పూర్తి భిన్నమైనవి. ఇవి త్రీ డైమెన్షనల్‌ తరహాలో ఉంటాయి. వసంతకాలం నుండి వేసవి కాలం వరకు వివిధ రుతువులను ప్రతిబింబించే కొలేజస్‌ ఇవి. పాశ్చాత్య ప్రపంచంలోని వాతావరణానికి సంబంధించినవే అయినప్పటికీ వాటిలోని అద్వితీయ నైపుణ్యం చూసే ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది.

art1 
1956లో హైదరాబాదులో జగదీష్‌ జన్మించారు. తండ్రి ఉద్యోగరీత్యా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అనేక ప్రాంతాలకు మారుతూ ఉండటంతో ఆ జిల్లాలోని గ్రామీణ జీవనం అన్ని పార్శ్వాలను ఆకళింపుచేసుకున్నారు జగదీష్‌. వాటిలో భాగంగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ జానపద కళారీతులను ఆ తర్వాత కళలో ఇముడ్చుకున్నాడు. జగదీష్‌ హైదరాబాదు, జెఎన్‌టియులో ఐదేళ్ల ఆర్ట్‌ డిప్లొమాను 1978లో పూర్తిచేశారు. 1980 నుండి బరోడా ఎంఎస్‌ విశ్వవిద్యాలయంలో మ్యూరల్‌ డిజైన్‌లో రెండేళ్ల పోస్ట్‌ డిప్లొమా చేశారు. అక్కడే కెజి సుబ్రమణియన్‌ లాంటి నిష్ణాతుల వద్ద శిక్షణ పొందారు.

art2 
దేశ విదేశాలలో విశేష ఖ్యాతినార్జించిన హైదరాబాదుకు చెందిన కళాకారుడు జగదీష్‌ చింతల. ఆయన అద్భుత కళాప్రస్థానాన్ని సూచిస్తూ ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ తన ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కొంతకాలం క్రితం ఏర్పాటు చేసిన సోలో ప్రదర్శన ప్రేక్షకులను ఆశ్చర్యంతో, ఆనందంతో తన్మయులను గావించింది. సాధారణంగా గ్యాలరీల్లో ప్రదర్శన అనగానే గోడలకు తగిలించిన అందమైన చిత్రాలు, లేదా కొలువుతీరిన శిల్పాలు మన కళ్లముందు గోచరిస్తాయి.

art3 
ఒక్కసారి ఆయన ప్రదర్శన తిలకించిన వారికి అది ఎందువల్ల సాధ్యమయిందో స్పష్టమవుతుంది.ముందుగా చూడగానే మొట్టమొదట ఆకట్టుకునేవి పేపర్‌ కొలేజస్‌. పేపర్‌ కొలేజస్‌ అంటే రంగు, రంగుల కాగితాల ముక్కలను ఒకదానిపై మరొకదాన్ని అందమైన ఆకృతులను సృష్టించే రీతిలో అంటించడం. సాధారణంగా ఇలాంటి కొలేజస్‌ బల్లపరుపుగా ఉంటాయి. కానీ జగదీష్‌ రూపొందించిన కొలేజస్‌ వీటికి పూర్తి భిన్నమైనవి.

jagdish1 
ఇవి త్రీ డైమెన్షనల్‌ తరహాలో ఉంటాయి. వసంత కాలం నుండి వేసవి కాలం వరకు వివిధ రుతువులను ప్రతిబింబించే కొలేజస్‌ ఇవి. పాశ్చాత్య ప్రపంచంలోని వాతావరణానికి సంబంధించినవే అయినప్పటికీ వాటిలోని అద్వితీయ నైపుణ్యం ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. వివిధ రుతువులను సూచించే చెట్లు, ఆకులు, పుష్పాలు, వాటికి అనువైన వర్ణాలు- వాటన్నింటినీ అమర్చిన తీరు ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఇవి కాకుండా కేవలం ఒకే ఒక్క పుష్పాన్ని పెద్ద ఆకారంలో కొలేజ్‌గా రూపొందించినవి కాగితాలతో ఎంతటి అద్భుత సృష్ట్టినైనా చేయవచ్చుననడానికి ఇవి నిదర్శనాలు.

Friday, April 29, 2011

ఒకే ఒక్కడు * కల్వకుంట్ల చంద్రశేఖరరావు

కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన రూటే సెపరేటు. అన్నింటా ఆయన స్థానం ప్రత్యేకమే. వ్యూహరచయితగా ఆయన అంతరంగం ఏమిటన్నది కేసీఆర్‌‌ను అంటిపెట్టుకున్న వారికీ అంతుపట్టని బ్రహ్మరహస్యం. ఎత్తుగడలో ఘనాపాఠీ. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీ పతనానికి, అదే అధికారంలో ఉన్న మరో పార్టీని అధికారంలోకి రానీయకుండా అడ్డుపడి, ప్రత్యర్థికి చెమటలు పట్టించిన రాజకీయ పోరాటవాది కేసీఆర్‌.

cs-kcr2తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ అంతరంగం కొన్ని సందర్భాల్లో ఆయనకు అత్యంత సన్నిహితులకు సైతం అందదు. ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో దాని బాధ్యత అంతా ఆయనదే. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టు కట్టినా, కేంద్రంలో మంత్రిగా పని చేసి తర్వాత రాజీనామా చేసినా, కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేయటం కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలందరితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు కారకుడైనా.. అలాంటి.. ఎలాంటి సంచలన నిర్ణయాలన్నీ ఆయనవే. అసలు కేసీఆరే ఓ సంచలనం. టిఆర్‌ఎస్‌లో వాటిని ప్రశ్నించే వారూ ఉండరు, వ్యతిరేకించేవారు అంతకన్న ఉండరు. తన ఆలోచనలను ఆయన పంచుకుంటారు, అలా పంచుకున్నప్పుడే తన నిర్ణయం సరైనదని అవతలివారు అనుకునేలా ఒప్పిస్తారు. ఇదీ కెసిఆర్‌ దగ్గర ఉన్న మెళకువ. రాజకీయ చతురత. ఇతరులను ఒప్పించి, మెప్పించడం ఓ కళ. ఆ కళలో కేసీఆర్‌ నిష్ణాతుడు. మహాకూటమిని సమర్థించి అందులో చేరినా, ఆ తర్వాత అదే కూటమిని తూర్పాపట్టినా, గత ఎన్నికల్లో అదే టీడీపీని ఓడించేందుకు కాంగ్రెస్‌తో చేతులు కలిపినా.. అందుకు ఓ లాజిక్కు చెబుతారు. ఆ తత్వం అందరికీ నిజమేననిపిస్తుంది. దటీజ్‌ కేసీఆర్‌!

ఒక సమస్యను ఎంచుకుంటే దానిపై అవిశ్రాంతంగా పోరాడటం, అంకిత భావంతో శ్రేణులతో పని చేయించటం ఆయనకు కొత్త కాదు. కొన్ని నిర్ణయాలు బెడిసికొట్టినా, పరిస్థితిని మళ్ళీ తన అదుపులోకి తెచ్చుకోవటం కెసిఆర్‌కు తెలిసినంతగా రాష్ట్ర రాజకీయ నేతలలో చాలామందికి తెలియదు. దివంగత సీఎం వైఎస్‌ దెబ్బకు తన పార్టీ చీలి, దాని ఫలితంగా వచ్చిన ఉప ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురైనా, మళ్లీ నిలదొక్కుకుని పార్టీని నిలబెట్టిందీ ఆయనే. అలాంటి మరొక ఉప ఎన్నికల్లోనే తన పార్టీ అభ్యర్ధులను రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే ఎవరికీ దక్కనంత మెజారిటీలు సాధించిపెట్టిన ఘనత నిస్సందేహంగా కల్వకుంట్లదే.

కేసీఆర్‌ రాజకీయ ప్రస్థానం
cs-kcr1వెనుకబడిన మెదక్‌ జిల్లా చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న జన్మించిన కెసిఆర్‌, తెలుగు సాహిత్యంలో ఎంఎ పట్టా అందుకున్నారు. 1982లో రాఘవాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్‌) అధ్యక్షుడుగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అదే సంవత్సరం రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడుగా పని చేశారు. 1985లో తొలిసారి సిద్దిపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన కెసిఆర్‌, ఆరు పర్యాయాలు అక్కడ ప్రాతినిధ్యం వహించారు. 2001-02లో తెలుగుదేశం పార్టీకి, డిప్యూటీ స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి సిద్దిపేట నుంచే 58,000 వోట్ల మెజారిటీతో అఖండ విజయం నమోదు చేశారు. 2004లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నికయ్యారు. 2006లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, యుపిఎ కూటమికి మద్దతు ఉపసంహరించి ఉప ఎన్నికల బరిలో దిగి రెండు లక్షల వోట్లకు పైగా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. గత ఏడాది ఎమ్మెల్యేలతో పాటు తాను, మరో ఎంపీ వినోద్‌ కుమార్‌ రాజీనామా చేసి మరోసారి లోక్‌సభలో అడుగు పెట్టారు. ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో కరవు నివారణ మంత్రిగా, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా, యుపిఎ కూటమిలో కేంద్ర కార్మిక మంత్రిగా పని చేశారు. తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడుగా, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా, రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు.

ఆయన ప్రసంగం గంగాఝరి...
కెసిఆర్‌ ఏ సభ నిర్వహించినా అది విజయవంతం కావటం పరిపాటి. సభలకు వచ్చే జనం ఒక్క కెసిఆర్‌ ప్రసంగం వింటే చాలునన్న ఆశతో ఎక్కడెక్కడినుంచో తరంగాల్లా తరలి వస్తారు. ఆయన ప్రసంగం గంగా ప్రవాహంలా సాగిందనేందుకు జనప్రవాహం చేసే కరతాళ ధ్వనులే తార్కాణం. సాధారణంగా రాజకీయ వేత్తలు కళ్ళ ముందు భారీ జన సందోహం కనిపిస్తే చాలు...శివమెత్తినట్టు ఊగిపోతూ ప్రసంగాలు సాగిస్తుంటారు. కెసిఆర్‌ అందుకు పూర్తి భిన్నం. విషయం ఎంత పెద్దదైనా, సూటిగా, స్పష్టంగా, నిర్దిష్ట కాల పరిమితి నిర్ణయించుకుని ముగించేస్తారు. ఎక్కడికక్కడి స్థానిక సమస్యలు ఆయన ప్రసంగాల్లో ప్రధాన అంశాలుగా ఉంటాయి. శత్రు పక్షాలను వాగ్ధాటితో దునుమాడే సమయంలోనూ ఆయన పెదవులు సంయమనం కోల్పోవు. అప్పుడప్పుడు చవటలు, సన్నాసులు, దద్దమ్మలు లాంటి ఉపమానాలు వాడినా దానికి సంబంధించి ఎదురయ్యే విమర్శలను తిప్పికొట్టగల సత్తా కూడా కెసిఆర్‌కు ఉంది. పిట్టకథలు, శబ్ద చమత్కారాలతో సాగే ప్రసంగాలు జనాన్ని అప్పుడే ముగిసిందా అనిపించేలా చేస్తాయి.



సాహిత్య పిపాసి
cs-kcr4 సాహిత్యంలో ఎంఎ పట్టా పుచ్చుకున్న కెసిఆర్‌, ఎంత పని ఒత్తిడిలో అయినా రోజుకు కనీసం రెండు, మూడు పుస్తకాలు చదవకుండా ఉండరని ఆయన సన్నిహితులు చెబుతారు. ప్రముఖ కవి నందిని సిధారెడ్డి సహాధ్యాయి అయిన ఆయన ఏ అంశం అయినా కూలంకషంగా అధ్యయనం చేయనిదే మాట్లాడరు. ఆయన ఉపన్యాసాల్లో అయినా, మామూలుగా మాట్లాడేటప్పుడైనా దొర్లే సూక్తులు, సామెతలు అన్నీ ఆయన పఠనానుశీలత నుంచి జాలువారినవే. తెలంగాణ ప్రాంతంపై ఇతరులెవరైనా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తే, ఆంధ్ర ప్రాంత మహాకవి శ్రీనాథుడి పద్యాలే కెసిఆర్‌ జవాబులకు ములుగర్రలు. పల్నాడు వెనుకబాటు తనాన్ని శ్రీనాథుడెలా వర్ణించిందీ కెసిఆర్‌ ప్రతిపదార్థ తాత్పర్యంతో విడమరచి చెబుతారు.పార్టీని స్థాపించే ముందు తెలంగాణ చరిత్రను కూలంకషంగా అధ్యయనం చేశారు. తెలియని విషయాలను నిపుణులతో చర్చించి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర జలసంఘంలో పని చేసిన ఆర్‌. విద్యా సాగరరావు, ఇతర నిపుణులతో నిరంతరం చర్చలు జరిపి విషయావగాహన పెంచుకున్నారు. అందుకే అంత సాధికారికంగా ఆయన ప్రసంగాలుంటాయి. తెలంగాణ చారిత్రక సంస్కృతీ విశేషాలు, పండుగలు, పబ్బాలు ఇలా దేన్నీ విడవకుండా లోతుగా తెలుసుకోవటం కెసిఆర్‌కు ఉన్న మంచి అలవాటు అని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. ఎన్నికలు వచ్చే సమయాల్లో కెసిఆర్‌ పార్టీ నిర్మాణంలో మునిగిపోతారు. ఎన్నికల్లో పొత్తులు అనివార్యమని అందరికీ తెలిసినా ఎవరితో జట్టు కడతారో సహచరులు చివరి క్షణం వరకూ చెప్పలేరు. తాను చేసింది, తీసుకున్నదీ తప్పని తేలినా దానిని సైతం ఒప్పని వాదించే నేర్పు-ఓర్పు కేసీఆర్‌ సొంతం.

గులాబీ కారు - మహా జోరు
* 27-01-2001
 డిప్యుటీ స్పీకర్‌, ఎమ్మెల్యే, టీడీపీ సభ్యత్వానికి కేసీఆర్‌ రాజీనామా
 అదేరోజు హైదరాబాద్‌లో నిర్వహించిన జలదృశ్యంలో ‘టీఆర్‌ఎస్‌’ పార్టీ ప్రకటన
 12,15,17-07 జిల్లా పరిషత్‌, మండల్‌ పరిషత్‌ ఎన్నికల్లో పోటీ
 100ఎంపీటీసీలు,2 జెడ్పీటీసీలు, 2జెడ్పీలు కైవసం
* 16-08-2001లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ, 3వేల సర్పంచులు, 12వేల వార్డులు గెలుపు
 
* 18-08-2001లో రాజకీయ పార్టీగా ఆవిర్భావం
* 22-09-2001 సిద్దిపేట ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ ఘనవిజయం
 
* 22-05-2002లో భూధాన్‌ పోచంపల్లిలో చేనేత కార్మికుల కోసం కేసీఆర్‌ బిక్షాటన
 * 11-08-2002లో  టీఆర్‌ఎస్‌లో తెలంగాణ సాధన సమితి విలీనం
 * 07-10- పల్లెబాట ప్రారంభం
 * 06-01-2003లో జలసాధన కార్యక్రమం, సామూహిక నిరాహార దీక్షలు, విద్యాసంస్థల
         బహిష్కరణ, రాస్తారోకోలు, మహిళా శక్తి ప్రదర్శన
 * 27-03న ఢిల్లీకి కారు ర్యాలీ
* 27-04 వరంగల్‌లో వరంగల్‌ జైత్రయాత్ర బహిరంగ సభ ( మాజీ ప్రధాని దేవగౌడ,
       అజత్‌సింగ్‌ రాక)
 
*  11-06-2003 జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద 610జీఓపై కేసీఆర్‌ ధర్నా
 09-09-2003న జాతీయ చిన్న రాష్ట్రాల కూటమి కన్వీనర్‌గా కేసీఆర్‌ ఎన్నిక

*  2004 ఏప్రిల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు, 26 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంటు స్థానాలు కైవసం
 21-05-2004లో రాజకీయ పార్టీగా గుర్తింపు
 26-05-2004 యూపీఏ-1లో కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌లో తెలంగాణ అంశం, 
       రాష్ట్ర పతి ప్రసంగంలో తెలంగాణ అంశం ప్రస్థావించటంలో  కేసీఆర్‌ విజయం

*  08-01-2005 తెలంగాణపై ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలో త్రీమెన్‌ కమిటీ ఏర్పాటు
 08-07-2005 వైఎస్‌ మంత్రివర్గంనుండి ఆరుగురు టీఆర్‌ఎస్‌ మినిష్టర్లు రాజీనామా
 17-07-2005లో వరంగల్‌లో యూపీఏ ప్రభుత్వ ప్రధాన భాగస్వామి శరద్‌ పవార్‌తో 
        బహిరంగ సభ
 17-10-2005లో పార్టీ నుండి ఎమ్మెల్యే సంతోష్‌రెడ్డి బహిష్కరణ
 11-11-2005న తిరిగి పార్టీలోకి సంతోష్‌రెడ్డి. 
 13-11-2005న 11 ప్రశ్నలతో 8 మంది టీఆర్‌ఎస్‌ అసమ్మతి ఎమ్మెల్యేల బహిరంగ లేఖ
 28-11-2005 టీఆర్‌ఎస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, బండారు 
        శారారాణి, దుగ్యాల శ్రీనివాస్‌రావులను పార్టీ నుండి బహిష్కరణ
 మే 2005లో స్థానిక సంస్థల ఎన్నికల్లో  మళ్లీ కాంగ్రెస్‌తో పొత్తు, 25 జెడ్పీటీసి 
        స్థానాలు కైవసం
 
* 14-08-2006 తెలంగాణ భవన్‌ ప్రారంభోత్సవ వేడుక
 23-08-2006న కేసీఆర్‌, నరెంద్ర యూపీఏ కేబినెట్‌కు రాజీనామా, సీఎంపీలో పేర్కొన్నట్లు 
        తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద నిరాహార దీక్ష
 12-09-2006 కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానానికి కేసీఆర్‌ రాజీనామా, యూపీఏకు మద్దతు 
        ఉపసంహరణ
 17-12-2006న కరీనగర్‌ ఉప ఎన్నికల్లో  2లక్షల1582 ఓట్లతో  కేసీఆర్‌ గెలుపు
 22-12-2006 నల్గొండలో ‘తెలంగాణ ఆత్మగౌరవ సభ’
 
* 22-03-2007 శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా హెచ్‌ ఏ రెహమాన్‌ ఎన్నిక
 25-03-2007అసెంబ్లీ గ్రాడ్యుయేట్‌ స్థానాల నుండి కే.దిలీప్‌కుమార్‌, ఆర్‌.
       సత్యనారాయణ గెలుపు

* 3-3-2008 కేసీఆర్‌తో సహా ముగ్గురు ఎంపీల రాజీనామా
 4-03-2008 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు అసెంబ్లీ, కౌన్సిల్‌కు రాజీనామా
 1-6-2008 ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 2 ఎంపీ స్థానాలు( కరీంనగర్‌, హన్మకొండ) 7 
        ఎమ్మెల్యే స్థానాలు, టీడీపీ నాలుగు ఎమ్మెల్యే , 1 ఎంపీ స్థానం, కాంగ్రెస్‌ 5 ఎమ్మెల్యే, 
        1 ఎంపీ స్థానం కైవసం చేసుకున్నాయి. 
 
* 21-12-2009న ఆరుగురు అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామా 
 29-11-2009న 14 ఎఫ్‌పై కరీంనగర్‌లో నిరాహారదీక్షకు బయలు దేరిన కేసీఆర్‌ను 
        అలుగనూర్‌ వద్ద అరెస్టు చేసిన గ్రేహౌండ్‌ పోలీసులు. ఖమ్మం  జైల్లోనే దీక్ష 
         ప్రారంభించిన కేసీఆర్‌ 
 1-12-2009  ఉద్యమం ఉదృతం
 09-12-2009న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి 
       చిదంబరం ప్రకటన
 23-12-2009 తెలంగాణ ఏర్పాటుపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల విస్తృత అభిప్రాయ 
       సేకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రకటన
 అదే రోజు 569 మందితో తెలంగాణ జేఏసీ ఏర్పాటు 

*  03-02-2010న జస్టిస్‌ శ్రీకృష్ణ  నేతృత్వంలో 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు

సేనానిలా..
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎవరి మాట వింటారు? ఎవరితో తన ఆలోచనలు పంచుకుంటారు? ఎవరి మాటకు ఎక్కువ విలువ ఇస్తారు?.. ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంటారుు. నిజానికి ేకసీఆర్‌ ఎవరి సలహాలు పాటించకపోరుునా, అందరి అభిప్రాయాలూ వింటారు. అందులో తనకు నచ్చనవి కొట్టిపారేస్తారు. తన అభిప్రాయాలనే బలపరిచేలా వ్యవహరిస్తుంటారు. కేసీఆర్‌‌కు అత్యంత సాన్నిహిత్యంగా వ్యవహరించే కొందరు నేతలు, వారి ప్రత్యేకతలు ఇవీ...

ప్రొఫెసర్‌ జయశంకర్‌
jayashankarకేసీఆర్‌ సహా అంతా ఈయనను గురుతుల్యుడుగా భావిస్తుంటారు. కీలకమైన అంశాల్లో కేసీఆర్‌ ఈయనతో చర్చిస్తుంటారు. టీఆర్‌ఎస్‌ సిద్ధాంతకర్త అన్న పేరు ఉన్నప్పటికీ అసలు సిసలు సిద్ధాంతకర్త కేసీఆరే. మొదటి నుంచీ మీడియాలో ఆవిధంగా ప్రచారంలోకి రావడంతో ఇప్పటికీ అదే భావన కొనసాగుతోంది. ప్రైవేటు సంభాషణలో మాత్రం జయశంకర్‌ను సిద్ధాంతకర్తగా కేసీఆర్‌ అంగీకరించరన్నది నేతల మాట. కానీ, కేసీఆర్‌కు నచ్చచెప్పగల స్థాయి, చొరవ జయశంకర్‌కు ఉంది. కేసీఆర్‌ తర్వాత స్థాయి నాయకులు మాత్రం జయశంకర్‌కు అత్యంత గౌరవం ఇస్తారు.

కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు
laxmikanthకేసీఆర్‌ మనస్ఫూర్తిగా విశ్వసించే అతికొద్ది మంది నేతల్లో కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఒకరు. కేసీఆర్‌ వరంగల్‌కు వెళితే కెప్టెన్‌ సాబ్‌ ఇంట్లోనే తిండి, బస. టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ సర్కారులో చేరినప్పుడు కెప్టెన్‌కు మంత్రి పదవి ఇప్పించారు. ఆయన కేసీఆర్‌ ఆదేశాలను జవదాటరు. ఒకరకంగా పార్టీకి మూలస్తంభం. ఆర్ధిక వ్యవహారాల్లో పార్టీకి దన్నుగా ఉంటారు. ఆర్థికపరమైన అంశాలన్నీ కెప్టెనే భుజాన వేసుకుంటారు. వివాదరహిత ముద్ర.

వినోద్‌కుమార్‌
కేసీఆర్‌కు బంధువు. నమ్మకస్తుడు. ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో జరిగే అధికార, అనధికార సమావేశాలకు పార్టీ ప్రతినిధిగా ఆయనే వెళుతుంటారు. సంక్షోభ సమయాల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటారు. మిగిలిన నేతలతో పోలిస్తే కేసీఆర్‌తో చనువు ఎక్కువ. కేసీఆర్‌ నిర్ణయాలను బలపచడంలో ముందుంటారు.

హరీష్‌రావు
harisharaoకేసీఆర్‌ మేనల్లుడిగా తెరపైకి వచ్చినప్పటికీ ఆ తర్వాత తన సత్తా ఏమిటో నిరూపించుకున్న యువ నేత. ఒక్కమాటలో చెప్పాలంటే.. సిద్దిపేటలో ఇప్పుడు కేసీఆర్‌ కన్నా ఎక్కువ ఇమేజ్‌ ఉన్న నేతగా అవతరించారు. ప్రజలు, పార్టీ శ్రేణులతో మమేకం అయ్యే నేత. యువతలో హరీష్‌కు మంచి పట్టు ఉంది. క్షేత్రస్థాయిలో యువత, శ్రేణులను సమీకరించి, ప్రత్యర్థులకు చెమటలు పట్టించగలిగే స్థాయి ఉన్న వ్యూహరచయిత. కేసీఆర్‌తో వాదించే శక్తి ఉన్న నేత. పార్టీలో తనకంటూ ప్రత్యేక వర్గం ఉన్న ఏకైక నేత ఆయనొక్కరే. కేసీఆర్‌ తీసుకునే కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్రధారి. హరీష్‌ ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం దుర్లభం. హరీష్‌కు అసంతృప్తి రాకుండా కేసీఆర్‌ సైతం జాగ్రత్త పడుతుంటారు. ఆయన వర్గానికి సరైన ప్రాధాన్యం ఇస్తుంటారు.

కేటీఆర్‌ : తండ్రి చాటు కొడుకుగా రాజకీయ తెరంగేట్రం చేసినా, ఆ తర్వాత తానేమిటో నిరూపించుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాలంలో ప్రజలు, పార్టీ శ్రేణులకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల మనోభావాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. ముక్కుసూటిగా మాట్లాడే నైజం. తండ్రి మాదిరిగానే అనర్గళంగా మాట్లాడే నేతగా పేరొందారు. కష్టపడి పనిచేసి మంచి వ్యూహకర్త అన్న ప్రశంసలు పొందారు.

హరీష్‌ మాదిరిగానే నిరంతరం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండే యువనేతగా పేరు తెచ్చుకున్నారు. తండ్రికి అన్ని అంశాల్లో బాసటగా నిలుస్తున్నారు. అయితే, కొన్ని కీలక అంశాల్లో తండ్రి నిర్ణయాలు నచ్చకపోతే దానిని వ్యతిరేకించే స్వభావం ఉన్న నేత. పార్టీలో తనకంటూ ఒక వర్గం ఏర్పాటు చేసుకున్నారు. యువతలో హరీష్‌ స్థాయిలో గుర్తింపు సాధించారు. పార్టీ నిర్ణయాల్లో కీలక శక్తి.

నాయని నర్శింహారెడ్డి
nainiకేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తులైన నేతల్లో ఈయనొకరు. ఆయనకు నచ్చచెప్పగలిగే కొద్దిమంది నేతలో నాయని ఒకరు. ‘నర్సన్నా’ అని ఆప్యాయంగా పిలిచే కేసీఆర్‌కు ఆయనపై ఎనలేని నమ్మకం. అందుకే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజు మినహా.. మిగిలిన అన్ని సందర్భాల్లో నాయని తోనే పార్టీ జెండా ఎగురవేయిస్తుం టారు.

ఈటెల రాజేందర్‌ :
పార్టీ శాసనసభాపక్ష నేత అయిన ఈ బీసీ నాయకుడిపై కేసీఆర్‌కు ఎనలేని విశ్వాసం. అనేక అంశాల్లో కేసీఆర్‌-మిగిలిన వారికి అనుసంధానకర్త. కేసీఆర్‌కు పూర్తి విధేయుడు.

కర్నె ప్రభాకర్‌ 

 కేసీఆర్‌కు అత్యంత విశ్వసనీయుడైన నేత. పార్టీ కార్యక్రమాలు చురుకుగా నిర్వహించడం తో పాటు, పార్టీకి సంబంధించిన తెరవెనుక వ్యవహారాల్లో నిష్ణాతుడు. ఉద్యమాల సమయంలో విద్యార్ధులతో సమన్వయం నెరిపే నేత.


Padma-rao-Trs,-Mla
పద్మారావు
కేసీఆర్‌కు విధేయుడు. పార్టీ నిర్వహించే బహిరంగసభల నిర్వహణ, పర్యవేక్షణలో ముందుంటారు. అధినేతకు ఆంతరంగికుడు. పార్టీ సంక్షోభ సమయంలో అధినేత తరఫున రాయబారిగా వ్యవహరించి, అసంతృప్త నేతలతో చర్చిస్తుంటారు.

జగదీశ్వర్‌రెడ్డి
jagadeshwarఅధినేతకు విధేయుడు. పార్టీ విధానాన్ని గట్టిగా వినిపించే నేత. కేసీఆర్‌ సైతం ఆయనను విశ్వసిస్తుంటారు. పార్టీ వాణిని చానెళ్ల ద్వారా సమర్ధవంతంగా వినిపించడంతో పాటు, ప్రత్యర్థుల విమర్శలను అంతే సమర్థవంతంగా తిప్పికొట్టగల నేత.


మధుసూదనాచారి

కేసీఆర్‌కు అత్యంత విశ్వసనీయుడు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. కేసీఆర్‌ నివాసం, కార్యాలయంలోనే ఎక్కువ సేపు గడిపి, కార్యకర్తలకు అందుబాటులో ఉండే నేత.


నాన్న బాటలో...
ktrరాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ప్రముఖుల కుటుంబాలకు చెందిన వ్యక్తులు రాణిస్తున్న సంఘటనలు స్వల్పమే. తండ్రి సీఎం అయితే కొడుకులు ఆ స్థాయిలో రాణించిన సందర్భాలు లేవు. కానీ.. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుటుంబం మాత్రం దీనికి పూర్తి భిన్నం. మొదట అందరి మాదిరిగా కేసీఆర్‌ కొడుకు, కూతురుగానే రాజకీయాల్లో కాలుపెట్టినప్పటికీ.. ఆ తర్వాత ఆ హోదాతోనే గుర్తింపు తెచ్చుకోకుండా.. స్వంత ప్రతిభతో రాణిస్తున్న కేటీఆర్‌, కవిత ఇప్పుడు స్వతంత్ర హోదాతో గుర్తింపు పొందుతున్నారు. ఇద్దరూ విదేశాల్లోనే చదివి, అక్కడే ఉద్యోగాలు చేసి వచ్చినప్పటికీ ఇక్కడి జనాల అంతరంగం, భాష, సంస్కృతితో మమేకమయిన కేటీఆర్‌, కవిత తెలంగాణ ప్రజానీకంలో తమకంటూ స్వంత ఒరవడి, గుర్తింపు సృష్టించుకున్నారు. తండ్రి మాదిరిగానే పుస్తకాలు చదివి విషయజ్ఞానం పెంచుకున్నారు.

కేసీఆర్‌ మాదిరిగానే ఇద్దరూ అనర్గళంగా, వ్యూహాత్మకంగా మాట్లాడే స్థాయికి, ఏ సమయంలో ఎంతవరకూ మాట్లాడాలో, ఏది మాట్లాడితే మీడియాను ఆకర్షిస్తుందో బాగా వంటబట్టించుకున్నారు. సాధారణ నాయకుల మాదిరిగానే రోడ్లపైకి వచ్చి జనంతో కలసి నినదిస్తు తామూ ప్రజానేతలమేనని కార్యాచరణతో నిరూపించుకున్నారు. సినిమాలో హీరోల కుమారులు హీరోలుగా తెరంగేట్రం చేసినప్పటికీ.. వారిని ప్రేక్షకులు గుర్తించకపోతే రాణించరు. తండ్రుల హీరోయిజం, గ్లామర్‌, పేరు ప్రతిష్ఠలు వారిని కాపడలేవు. రాజకీయాల్లో కూడా అంతే. ఒక స్థాయి వరకూ అధినేతల కుటుంబసభ్యులుగా తొలి హోదా సంపాదించుకున్నప్పటికీ, ప్రజల మధ్యకు వెళ్లకుండా, నేతలుగా గుర్తింపు సాధించలేక వెనుకబడిన వారు రాష్ట్ర రాజకీయాల్లో కోకొల్లలు. కానీ, కేసీఆర్‌ కుమారుడు తారకరామారావు, కూతురు కవిత మాత్రం తండ్రి ద్వారా తమకు వచ్చిన హోదాను వినియోగించుకుని జనామోదంతో అగ్రనేతలుగా ఎదుగుతున్నారు.

kavitha అచ్చ తెలంగాణ యాసతో ఇద్దరూ తెలంగాణ ప్రజలకు చేరువయ్యారు. అధినేత వారసులుగా ఉన్నప్పటికీ, ఆ ముద్రకే పరిమితం కాకుండా కష్టపడి ప్రజల్లోకి వెళ్లి, ఉద్యమాల ద్వారా గుర్తింపు సాధించారు. కేటీఆర్‌ తన తొలి ఎన్నికలో సిరిసిల్లలో అత్తెసరు మెజారిటీతో గెలిచినప్పటికీ, పట్టువిదలని విక్రమార్కుడిలా పనిచేసి రెండోసారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రతి ఆందోళన కార్యక్రమాల్లోనూ ముందుండి వాటిని నడిపిస్తు న్నారు. అటు కవిత సైతం ఉద్యమ సమయంలో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకు న్నారు. బతుకమ్మ పండుగ శతాబ్దాల నుంచి ఉన్నప్ప టికీ.. కేవలం కవిత ద్వారానే దానికి ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. ఆ పండుగ ప్రాశస్త్యం వివరించేందుకు ఆమె గల్లీ నుంచి ఢిల్లీ వరకూ కార్యక్రమాలు చేపట్టారు. మహిళలను మమేకం చేసి, ఆ పండుగ ప్రత్యేకతను స్కూళ్ల వరకూ విస్తరింప చేశారు. తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, జీవన విధానంపై పుస్తకాలు సైతం ముద్రించడం, తెలంగాణ సంస్కృతిని ఈ తరాలు మర్చిపో కుండా ఉండేందుకు జిల్లాల్లో పర్యటనలు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో కవిత తానేమిటో నిరూపించుకున్నారు. రానున్న ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసే స్థాయికి ఎదిగారు.

తెలంగాణ సాధిస్తాం : ఈటెల
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోపాటు పునర్‌ నిర్మాణం చేసుకోవడం టిఆర్‌ఎస్‌ లక్ష్యమని టిఆర్‌ఎస్‌ శాసన సభ పక్షనేత ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. పార్టీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మేజర్‌న్యూస్‌తో మనసు విప్పి మాట్లాడారు. కాషాయం నుండి పచ్చ జెండా వరకు అన్ని వర్గాలు తెలంగాణ ఎజెండానే ప్రధానంగా తీసుకుని ముందుకు సాగే విధంగా 10 సంవత్సరాల ఉద్యమం దోహదపడిందని పేర్కొన్నారు.

జూన్‌లోగా కేంద్రం తెలంగాణ ఇస్తుందని అంటున్నారుమీరు విశ్వసి స్తారా ?
ఈటెల : ఉద్యమ కారులు ఆశావాదులు ఇన్నాళ్ళుగా చరిత్రను చూస్తే పలు దఫాలు కేంద్రం మోసం చేసింది. ఐనప్పటికీ వేచి చూస్తున్నాం. మళ్ళీ ఉద్యమం ఉధృతం చేసి వచ్చే వరకూ పోరాడుతాం.

దళితున్ని సిఎం చేస్తారని ప్రకటించారు. కట్టుబడి ఉన్నారా !

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత దళితుడు మొదటి ముఖ్యమంత్రి అవడం ఖాయం. ప్రకటించిన ఆనాటి నుండి ఏ నాటి వరకు అయినా తమ సిద్ధాంతం మారదు.

మిలియన్‌ మార్చ్‌ విధ్వంసం వెనుక ఎవరున్నారని భావిస్తున్నారు
అగో ఇగో అంటూ మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుతో విసిగి వేసారి పోయి కడుపు మండిన ఉద్యమకారులు ఆవేదనతో చేసిన పని.
టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ప్రచారంలో ఉంది.
తెలంగాణ వచ్చిన తరువాతనే విలీనం సంగతి ముందుకు వస్తుంది. ముందుగా ప్రత్యేక రాష్ట్రం సాధించుకుందాం. ఆ తరువాత శిథిలమైన మన ప్రాంతాన్ని మనం పునర్‌నిర్మించుకుందాం.

హైదరాబాద్‌లో పార్టీ పరిస్థితి
etela ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌ నుండి హైదరాబాద్‌ వరకు ప్రతి ఒక్కరి హృదయాల్లో తెలంగాణ వాదం నాటుకుపోయింది. పట్టణాలు పల్లెలు అంటూ ఎక్కడా వ్యత్యాసం లేదు. దుబాయిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం టిఆర్‌ఎస్‌ ద్వారానే సిద్ధిస్తుందని భావిస్తున్నారు. పార్టీ సైతం ఏకైక ఎజెండాతో ముందుకు సాగుతోంది.

పార్టీపటిష్టత కోసం ఏ విధంగా పావులు కదుపుతారు.
కొన్ని జిల్లాల్లో ఎన్నికలు జరిగిన సమయంలో ఉన్న వాతావరణం నేడు లేదు. ఇక్కడ బలం, బలహీనతలు, నాయకులు లేరు. కార్యకర్తలు రారు అనేది అసలే కాదు. ఒక అంశం మీద ఆధారపడి పని చేస్తున్న దేశంలోనే ఏకైక ఉద్యమ పార్టీ. పటిష్టత అనేది నిరంతరం కొనసాగుతుంది. అది పార్టీ అంతర్గత విషయం.
ఎమ్మెల్యేలు అభివృద్దిపై దృష్టిసారించడం లేదని ఆరోపణలున్నాయి
తెలంగాణ ఉద్యమం వల్లె ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధికోసం ప్రభుత్వంతో కోట్లాడి నిధులు తెస్తున్నారు. పాలకులు అభివృద్ధి విషయంలో తెలంగాణ విషయంపై వివక్ష చూపిస్తున్నారు. అభివృద్ధిపై టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దృష్టి పెట్టలేదనేది వాస్తవం కాదు.

పక్కదారి పడుతున్న వారి విషయం
ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేస్తూ ముందుండి నడిపిస్తున్న వారిని సమైఖ్య వాదులు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నారు. అది కుట్రలో భాగమే పలు సందర్భాల్లో పార్టీ కఠినంగా వ్యవహరించింది. ద్రోహం చేసిన వారికి ప్రజలే గుణపాఠం చెపుతారు. అలాంటి వారికి భవిష్యత్తు ఉండదు.

cs-kcr

Sunday, December 26, 2010

తెలుగువారి సందేహాల సమాహారమైన .... '' తెలుగ్వైతం ''

తాంబూలం

ఇంత కాలానికి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి ఆధ్యాత్మికతా దర్శనం అయింది. తెలుగు మతం ఊపిరి పోసుకుంది. దాని పేరు తెలుగ్వైతం. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అన్నీ ఈ తెలుగ్వైతం ముందు దిగదుడుపే.

మామూలుగా ఏం జరుగుతుందంటే, ఒక్కో సమూహానికి ఒక్కో మతం ఉంటుంది; కానీ తెలుగువారిలో ఒక్కొక్కరికీ ఒక్కో మతం ఉంటుంది. ఆ మతం ఇతర మతాలకంటే ఎందుకు గొప్పదంటే దాని జీవితం క్షణక్షణానికీ మారుతూంటుంది. మతం అనేది అశాశ్వతమనీ, అందువల్ల దాన్ని శాశ్వతంగా మారుస్తూండాలనీ తెలుగ్వైతం చెబుతుంది. శంకరాచార్యులవారిని చదివేస్తే అద్వైతం, రామానుజాచార్యులను చదివేస్తే విశిష్టాద్వైతం అర్థమయిపోతాయంటారు. హన్నన్నా. అంత సులభంగా ఒహణ్ణి చదివేస్తే అర్థమైపోయేవి కూడా మతాలేనా? ఎవడికి వాడు నిగ్గు తేల్చుకునేదే అసలు సిసలు మతం. ప్రతి ఒక్కడినీ సృష్టికర్తను చేసేదే అసలు సిసలు మతం. అదే తెలుగ్వైతం.
ద్వైతానికి ఇద్దరు కనిపిస్తారు.
అద్వైతానికి ఇద్దరూ కలిసి ఒక్కరుగానే కనిపిస్తారు.
విశిష్టాద్వైతానికి ఒకరికి దాసోహమనే మరొకడు కనిపిస్తాడు.
తెలుగ్వైతానికి ఎవరూ, ఏదీ ఉన్నట్టే కనిపించరు.

కావాలంటే రోశయ్యగారిని అడగండి 'అసలీ రాష్ట్రంలో ప్రతిపక్షమనేది ఉందా? మీడియా అనేది ఉందా? మర్యాదస్తులెవరైనా ఉన్నారా? అసలీ రాష్ట్రంలో ఉన్నవారు అన్నం తింటున్న మనుషులేనా' అన్నీ సందేహాలే.
జయప్రకాశ్ నారాయణ్ గారినీ, నారాయణగారినీ, రాఘవులుగారినీ అడగండి - అసలీ రాష్ట్రంలో ప్రభుత్వమనేది ఉందా? ఉన్నా దాని పేరు ప్రభుత్వమేనా? ఆ ప్రభుత్వానికి చీమూ, నెత్తురూ ఉన్నాయా?' అన్నీ సందేహాలే.
చిరంజీవిగారిని అడగండి 'కాంగ్రెస్ అధిష్టానం నన్నెందుకు ప్రేమిస్తోంది? ఈ ప్రేమను స్వీకరిస్తే నా బతుకు ట్రాజెడీనా, కామెడీనా? ఇద్దరు హీరోయిన్లతో చేసీ చేసీ చివరికి ప్రజారాజ్యం, కాంగ్రెస్‌ల ప్రేమలో కూడ నేను ఎంచుకోవాల్సి వస్తుందా? దీనికి పరుచూరి గారి స్క్రిప్ట్ లేదే?' అన్నీ సందేహాలే.

చంద్రబాబుగారిని అడగండి 'కాంగ్రెసూ రైతుల్ని నాశనం చేస్తే, కాంగ్రెసూ ఫ్లయ్ ఓవర్లూ, మెట్రోలూ వేస్తే, కాంగ్రెస్సూ సూక్ష ్మరుణాల ఆత్మహత్మలు చేస్తే, మరి నేనెందుకున్నట్టు? నాకసలు ఉనికి ఉందా లేదా?' అన్నీ సందేహాలే. లగడపాటి రాజగోపాల్‌గారిని అడగండి 'కేసీఆర్‌ది నోరేనా? అది తెరిస్తే వచ్చేది మాటలేనా?' - అప్పుడు కేసీఆర్ గారికి కూడా మరో సందేహం - 'లగడపాటి ఎం.పీనా? లేక పి.సి. సర్కార్ శిష్యుడా? ఎం.పీయే అయితే, కొంతకాలం తోటి ఎం.పీని కదా - నాకు మాయమయ్యే ట్రిక్కు ఎందుకు నేర్పలేదు? విజయవాడలో మాయమై, హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యే ట్రిక్కే నేర్పి వుంటే, ఉద్యమం చేసేవాణ్ణి కాదేమో? ఇద్దరం కలిసి, ప్రజలమీద కనికట్టు విద్య చేస్తూ ఉంటే, జీవితం గడిచిపోయేది కాదూ?' జగన్‌గారిని అడగండి - 'అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఉందా? ఉంటే అందులో నేనున్నానా? ఉన్నాను పో. అయితే ముఖ్యమంత్రిని ఎందుకు కాలేదు? లేను పో.
మరి అది కాంగ్రెస్ ఎలా అవుతుంది? నేనెవరో తెలీనపుడు నేను ఎవర్ని ఓదార్చాలి? నన్ను నేను ఓదార్చుకోవడానికి యాత్ర అవసరమా? ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? కాని ఇంట్లో కూర్చుంటే మీడియా కెమెరాలు రావు కదా. ఇప్పుడు నేను ఎవర్ని నమ్మాలి? చివరికి సురేఖమ్మ కూడ నాకు అనుకూలమో, వ్యతిరేకమో తెలిసి చావట్లేదు కదా. నాన్న పోగానే వాళ్లంతా సంతకాలు పెట్టిన కాగితాలు ఏమయ్యాయి? అసలవి సంతకాలేనా?'
ఆయనకు తెలీడం లేదు గానీ నిజానికి ఆయనే తెలుగ్వైతం మత వ్యవస్థాపకుడు.

ఇక మీడియా వారి సందేహం - 'మేమిప్పుడు ఎవరివైపు?' (మీడియా ఎవరివైపూ ఉండనవసరం లేదన్న తత్వానికి తెలుగ్వైతంలో చోటు లేదు). అసలు ఎవరు ఎవరి వైపో మేమే కదా నిర్ణయించాల్సిన వాళ్లం! మాకే అర్థం కాకపోతే ప్రజలకేం చెబుతాం? బయటకు వెళ్తే, ఎవడో ఆపి 'తెలంగాణ వస్తోందా?' అని అడుగుతాడు. మాకేం తెలుసు? మరొకడు 'తెలంగాణ రాకపోతే జనవరిలో ఏమవుతుంది?' అని అడుగుతాడు. మాకేం తెలుసు? కాని తెలీకపోతే మేం మీడియా ఎలా అవుతాం? వివిధ సభా నిర్వాహకులకూ అనేక సందేహాలున్నాయి. ఆహ్వాన పత్రికల్లో 'ముఖ్యమంత్రిగారిచే ప్రారంభం' అంటే సరిపోతుందా? పేరు వేసే సాహసం చేయొచ్చా? అలాగే పేర్లు లేకుండా సాంస్కృతిక శాఖమంత్రి, ఉన్నత విద్యామంత్రి ... ఇలా వేసుకుంటూ పోవడం క్షేమం కదా?'

ఇక ప్రజలు - 'అసలు వైఎస్సార్ చనిపోయాడా?' అనే ఆధ్యాత్మిక ప్రశ్న నుంచి 'కిరణ్‌కుమార్‌రెడ్డి గారు తొందరపడి క్యాంప్ ఆఫీసులోకి మారిపోయారా? మేం హైద్రాబాద్‌లో ఇల్లు కొనాలా? అమ్మాలా' వంటి వాస్తవ జగత్తుకు సంబంధించిన ప్రశ్నల వరకూ అనేకం అడుగుతున్నారు.
ప్రశ్నించడం హేతువాద దృక్పథానికి సంకేతం. సందేహం అపరిమితమైన ఐక్యూకి సంకేతం. తెలుగువారి సందేహాల సమాహారమైన తెలుగ్వైతానికి కొత్త సంవత్సరంలో 'ప్రపంచ మతములు' అనే విజ్ఞాన సర్వస్వంలో చోటు లభిస్తుందని ఆశిద్దాం.

- మృణాళిని
98490 65147

Sunday, November 14, 2010

రాజకీయ రారాజు దండు

 
పేద కుటుంబంలో పుట్టి శ్రమను, ప్రతిభను నమ్ముకుని ఒక్కొక్క మెట్టు ఎక్కి ఉన్న త శిఖరాన్ని అందుకున్న నిరంతర శ్రామికుడు, మాజీ మంత్రి దండు శివరామరాజు ఇక లేరన్న విషయాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ అతి నిరాడంబరంగా అందరి ఆత్మీయుడుగా పేరొందిన శివరామరాజు జిల్లా రాజకీయాల్లో రారాజుగా వెలుగొందారు. నిర్మొహమాటంగా, నిర్భయంగా మాట్లాడుతూ మ చ్చలేని రాజకీయ నాయకుడిగా పేరుగాంచారు.

ఆదివారం నిడమర్రు మండలం మందలపర్రులోని తన స్వగృహంలో తుది శ్వాస విడవడంతో జిల్లా ప్రజానీకం దిగ్భ్రాంతికి గురయ్యారు. జిల్లాలోని రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు దండు మృతికి తీవ్రసంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు,కార్యకర్తలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

పేద కుటుంబంలో పుట్టి..
జిల్లా రాజకీయాల్లో 1936,జూలై14న పెనుమంట్ర మండలం పొలమూరులో పేద కుటుంబంలో పుట్టి డ్రిల్ మాస్టారుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాల్లోకి ప్రవేశించి రెండు సార్లు ఎమ్మెల్సీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. గణపవరంలోని చింతలపాటి బాపిరాజు విద్యాసంస్థల్లో పీఈటీగా పనిచేస్తూనే కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. 1974లో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయనియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై 1984వరకు రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు.

కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 1989లో అత్తిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి మాజీ మంత్రి యిందుకూరి రామకృష్ణంరాజు(కాంగ్రెస్)పై 1111ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై ఓటమి చవి చూసినా పార్టీని వెన్నంటి ఉండి 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డాల స్వామినాయుడుపై సుమారు 55వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తిరిగి 1999లో జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి నూకారపు సూర్యప్రకాశ్‌పై మూడవసారి విజయం సాధించి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో దేవాదాయ,ధర్మాదాయ శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేవాదాయ శాఖలో ఉన్న సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ దేవాలయాల అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలోఅత్తిలి నియోజకవర్గం రద్దు ఆయ్యింది. దీంతో అత్తిలి నియోజకవర్గంనుంచి చివరి మంత్రిగా దండు రికార్డుకెక్కారు. అనారోగ్యం బారిన పడిన తరువాత తన ఆస్తిలో కొంతభాగాన్ని దేవాలయాలకు తనను నమ్ముకున్న సన్నిహితులకు దానం చేశారు.

జిల్లా పార్టీ అధ్యక్షునిగా
1994 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన దండు 1995లో జిలా పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి పార్టీ పటిష్టతకు కృషి చేయడమేకాకుండా జిల్లా కేంద్రంలో టీడీపీ కార్యాలయ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు. అంతేగాక తన సొంత నియోజకవర్గం అత్తిలిలోను పార్టీకి సొంత కార్యాలయ భవనం నిర్మించి ఔరా అనిపించుకున్నారు. పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తునే 2004లోజరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరకువాడ శ్రీరంగనాధరాజుపై స్వల్ప తేడాతోఓటమి చవిచూశారు మూడు ఏళ్ల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. తదుపరి అనారోగ్యంతో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనలేకపోయారు.

దేవాలయాల ఆదాయం పెంచిన ఘనుడు
రాష్ట్రంలో దేవాదాయ భూముల కౌలుదారుల చట్టంలో మార్పులుతీసుకువచ్చిన ఘనత మంత్రిదండుదే. మంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు రాష్ట్రంలో దేవాలయాలకు 2.68లక్షల ఎకరాలనుంచి రూ.18 కోట్ల ఆదాయం లభించేది. సుప్రీంకోర్టు నుంచి కౌలుదారుచట్టంలో మార్పులు తీసుకురావడతంతో ఆదాయాన్ని గణనీయంగా సుమారుగా రూ. 500కోట్లకు పెంచగలిగారు. ఈయన హయాంలో గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించగలిగారు. దేవాలయాల్లో వసతి సౌకర్యాల కల్పనకు కృషిచేస్తూనే అవినీతి ప్రక్షాళనకు నడుం బిగించి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలతిరుపతి దేవస్థానంలోకి మారువేషంలో వెళ్లి అక్కడ క్షౌరశాలల్లో జరుగుతున్న అవినీతిని ఎండ గట్టారు. అత్తిలి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషిచేశారు.

'దేవుడు ' రాజు ఇక లేరు!

పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని పొలమూరులో 1936లో దండు వెంకట్రాజు, సుభ్రదమ్మ దంపతులకు శివరామరాజు జన్మించారు. అదే గ్రామంలో ఎస్ఎస్ఎల్‌సీ వరకు చదివారు. 1966లో పిప్పర గ్రామానికి చెందిన అరుణ ప్రభను వివాహం చేసుకున్నారు. దండు శివరామరాజు సతీమణి ఆరుణప్రభతో ఆయన నిడమర్రు మండలం మందలపర్రులో స్థిిరనివాసం ఏర్పరచుకున్నారు.

సంతానం లేని దండు అవినీతికి పాల్పడి సంపాదించాల్సిన అవసరం లేదని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. శివరామరా జు వ్యవసాయం చేయించడమంటే ఆ సక్తి చూపేవారు. శివరామరాజు తండ్రి నిరక్షరాస్యుడు కావడంతో తనను బా గా చదివించాలని, మంచి ఉద్యోగస్తుడుగా చూడాలని తన తండ్రి భావించేవారని రాష్ట్ర మంత్రి కావడం ద్వారా ఆయన కోర్కె తీర్చానని దండు చెబు తూ ఉండేవారు.

చిన్నతనం నుంచి వి ద్యాభ్యాసంతో పాటు క్రీడలపై ఆయనకు ఆసక్తి ఎక్కువ.ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో బతుకుతెరువు కోసం ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్‌కు వెళ్ళి పిీఈటీ ఉద్యోగం సంపాదించా రు. కబడ్డీ, షాట్‌పుట్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ లాంటి క్రీడల్లో ప్రావీణ్యం ఉండేదని, అదే స్ఫూర్తితో డ్రిల్‌మాస్టర్ అయ్యానని నేటికి చెబుతూ ఉండేవారు.1968లో పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో పనిచేసేటప్పుడు బాపిరాజు ధర్మసంస్థలో కార్యదర్శిగా పనిచేశారు. మూర్తిరాజు వ్యవస్థాపకులుగా ఉన్న ఈ సంస్థ ఆధ్వర్యంలో 18 విద్యాసంస్థలు ఉండేవి. దీనికి శివరామరాజు కార్యదర్శిగా వ్యవహరించారు.

ఉపాధ్యాయులకు మాత్రమే సేవచేస్తున్న తాను ఇంకా విస్తృతంగా సామాన్య ప్రజలకు బడుగు, బలహీన వర్గాలకు సేవలందించాలనే తపనతో రాజకీయంలోకి వచ్చానని అంటుండేవారు. అప్పట్లో అత్తిలిని కుప్పం నియోజకవర్గం తరహాలో అభివృద్ధి చేయాలని తలంపు పెట్టుకునేవాడినని దండు చె బుతుండేవారు. తీరిక దొరికితే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యేవారు. వ్యవసాయానికి ప్రస్తుత ఆ«ధునిక వి ధానాలు మరింత ప్రోత్సహకరంగా ఉన్నాయని ఆయన అంటుండేవారు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా తూర్పుగోదావరిజిల్లాలో ఎక్కువ కాలంపనిచేశారు. అనపర్తి, అమలాపురం, కోమరగిరిపట్నం పాఠశాలల్లో పీఈటీగా పనిచేశారు.

ప్రముఖ విద్యాసంస్థ బాపిరాజు ధర్మసంస్థ్దకు కార్యదర్శిగా పనిచేసిన దండు శివరామరాజు 1974శాసనసభ ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లా నుంచి పోటీచేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇదే క్రమంలో 1982లో కూడా పోటీచేసి రెండవసారి కూడా ఎ మ్మెల్సీగా విజయం సాధించారు. ఉపాధ్యాయుల సమస్యలపైనా, విద్యారంగ సమస్యలపైనా చట్ట సభలో ఆయన పోరాడుతూ ఉండేవారు. తన వాగ్ధాటితో, సమస్యలపై స్పందించే తీరు అందరినీ అకట్టుకునేది.

ఇలా ఆ రోజుల్లోనే ఆయన చట్ట సభల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ మక్కువతోనే 2005లో శాసన మండలి పునరుద్ధరించిన తర్వాత మరోమారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు. రాజకీయ ఉద్దండులైన మాజీ మంత్రి సర్వోదయ నా యకులు చింతలపాటిమూర్తి రాజు, అప్పటి అత్తిలి ఎమ్మెల్యే, దివంగత వేగే శ్న కనకరాజు, కింగ్‌మేకర్‌గా ఈడూరి సూర్పరాజు తమకు స్ఫూర్తి ప్రధాతల ని దండు చెబుతుంటారు.

1984లో ఎన్.టి.ఆర్. పిలుపుమేరకు దండు టీ డీపీలో చేరారు. తొలిసారిగా 1989లో అత్తిలి నుంచి టీడీపీ అభ్యర్థ్దిగా పోటీచేసి గెలుపొందారు. తొలిసారి అసెంబ్లీలో ప్రవేశించడమే కాకుండా 1989, 94 సంవత్సరాల మధ్య అసెంబ్లీలో పార్టీవిప్‌గా పనిచేశారు. 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ ఎన్నికై 2వ సారి అసెంబ్లీలో ప్రవేశించారు. 1999 శాసనసభ ఎన్నికల్లో అత్తిలి నుంచి మళ్లీ అసెంబ్లీకి ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో దేవాదాయ శాఖకు కేబినెట్ మంత్రి అయ్యారు.

వ్యక్తిగతంగా కోపిష్టిగా కనబడే దండు కోపం వచ్చినా కేకలు వేసినా మరుక్షణం పాలపొంగులా కోపం కరిగిపోతుందని ఆయన అనుచరులు, అభిమానులు చెబుతుంటారు. అప్పట్లో పనిచేయని అధికారులు నిలదీయడం, దులిపివేయడం ఆయన నైజం. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తునిగా మారు వేషంలో వెళ్లి అక్కడ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. అప్పట్లో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

పదవిలో ఉన్నా లేకపోయినా గ్రామగ్రామాన తిరగడం, కార్యకర్తలను ప్రజలను కలుసుకోవడం అతని విలక్షణ శైలి.మోటర్‌సైకిల్, సైకిల్, పాదయాత్ర సంస్కృతిని దండు ప్రవేశపెట్టారంటే అతిశయోక్తికాదు.అలాగే దేవాదాయ శాఖా మంత్రిగా రైతువారి చట్టం నుంచి దేవాదాయ భూముల మినహాయింపుచట్టాన్ని సుప్రీంకోర్టు ద్వారా ఆయన ప్రవేశపెట్టారు.దేవాదాయ భూములు అన్యక్రాంతంకాకుండా పటిష్టపర్చడానికిఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి వెనుకడుగు వేసేవారు కాదు.దాతల ఆశయాల మేరకు ఇచ్చి న భూములను కాపడటానికి రాజీపడే ప్రశక్తిలేదని,ఇందుకోసం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఆస్తులను పరిరక్షించేందుకు జీవో తీసుకువచ్చారు.

సేధ్యానికి పనికిరాని భూములు అవసరమైతే అ మ్మి ఆసొమ్ము దేవాలయాల పేరున ఫి క్సిడ్ డిపాజిట్‌చేసి భగవంతునికి ధూ ప, దీపనైవేద్యాలకు ఏర్పాటు చేశారు. గతంలో దేవాదాయ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ముస్లింకు షాదీకనాలు, క్రైస్తువులకు చర్చిలు, హిందూ దేవాలయాల అభివృద్ధ్దికి సమర్థవంతంగా పనిచేసిన గుర్తింపు తెచ్చుకున్నారు.పెంటపాడు, మార్టేరు స్టేట్ హైవే నిర్మాణానికి రూ.32కోట్లు మంజూరుచేయించారు. స్వజలధార, డ్వాక్రా గ్రూపులు, నియోజకవర్గంలో 200సాముహికమరుగుదొడ్లను అధునాతన సాంకేతిక ప రిజ్ఞానంతో నిర్మించి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు.

రైతు సోదరులకు సౌకర్యంగా ఉండేందుకు కోమర్రు రూ.కోటి 20లక్షలతో యనమదుర్రు డ్రెయిన్‌పై వంతెన నిర్మించారు.అలాగే పిప్పర వద్ద యనమదుర్రు డ్రెయిన్‌పై కూడా నూతన వంతెన నిర్మాణానికి కృషిచేశారు.నియోజకవర్గంలో కట్టవపాడు, గణపవరం, కోముట్లపాలెం, వాకపల్లి తదితర గ్రామాల్లో ఫుట్‌పాత్ వంతెలను ఏర్పాటుచేసి రైతులను ఆదుకున్నారు. డ్రిల్‌మాస్టర్‌గా స్కూల్‌పిల్లలను బెత్తంతో అదిరిస్తూ పిరియడ్‌చేయించి డ్రిల్‌చేయించడం ఆయన వృత్తి. అయితే హైదరాబాద్‌లో జరిగిన మహానాడులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ దండుశివరామరాజు చేత డ్రిల్‌మాస్టర్ తరహలో విజిల్ ఊదు తూ చేతితో బెత్తం పట్టుకుని కార్యకర్తలకు క్రమశిక్షణతో రాజకీయ డ్రిల్‌చేయించే బాధ్యతను అప్పగించారు.

శివరామరాజు స్వార్జిత ఆస్తులను, రూ.2కోట్లు విలువచేసే 11ఎకరాల భూములను ధార్మిక సంస్థ్దలకు ధానధర్మం చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన దస్తావేజులను సంబంధిత వారికి అందించారు.తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకు వీరాభిమానం. అందుకే జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఆయన ఎకరం భూమిని రాసిఇచ్చారు. శివరామరాజు అధ్యాత్మికంగా సేవా కార్యక్రమాలుచేయడం ముందుండి పనిచేసేవారు.అలాగే ఎమ్మెల్సీగా పనిచేసిన రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.జనార్దన్‌రెడ్డి ద్వారా రూ.కోటి30లక్షలు తీసుకువచ్చి రైతుల సంక్షేమానికి వెంకయ్యవయ్యోరు మరమ్మతులు చేపట్టారు.అప్పట్లో తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అప్పటి ప్రధానీ విపి సింగ్‌ను కలిసి పంటల బీమా, నష్టపరిహరం తీసుకువచ్చి రైతు బాంధవుడిగా గుర్తుతెచ్చుకున్నారనడంలో అతిశయోక్తిలేదు.

ఆయన దేవాదాయ మంత్రిగా ఉన్నరోజుల్లో గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని రూ.25కోట్లతో అన్నిదేవాలయాలను సుందరంగా తీర్చిదిద్ది పుష్కరాలను విజయవంతం చేయడంలో ఆయనకృషిచేశారు. అవి ఇప్పటికి మరుపురాని స్మతులుగా గుర్తుండిపోయాయి. శివరామరాజు బడుగు, బలహీన వర్గాలకే గుర్తింపుతెచ్చుకున్న వ్యక్తి. ప్రజలు నేటికి మరువలేరని బలహీనవర్గాలతో పాటు దళిత, బిసి మహిళలతో దండు సేవల పట్టానేటికి మరువలేకపోతున్నారు. ఆయన భౌతికంగా మన మధ్యలేకున్నా చిత్తశుద్ధి అతని సేవలు చెరగని జ్ఞాపకాలు.

మాజీ దేవాదాయ మంత్రి శివరామరాజు కన్నుమూత
ఊపిరితిత్తుల కేన్సర్‌తో కొంతకాలంగా నిమ్స్‌లో చికిత్స
తన యావదాస్తి దానం చేసిన దండు

రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ మంత్రి దండు శివరామరాజు (74) ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యపరిస్థితి చేజారిపోవడంతో ఆదివారం ఆంబులెన్స్‌లో ఆయనను పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలంలోని స్వగ్రామం మందలపర్రుకు తీసుకొచ్చిన గంటలోపే తుదిశ్వాస విడిచారు.

శివరామరాజుకు భార్య ఉన్నారు. సంతానం లేదు. ఆయన తన యావదాస్తిని మిత్రులకు, సన్నిహితులకు, పలు దేవాలయాలకు, అత్తిలిలోని టీడీపీ కార్యాలయానికి, సుబ్రహ్మణ్యేశ్వస్వామి దేవాలయానికి దానం చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన కాలంలో సామాన్య భక్తునిలాగా మారువేషంలో తిరుమల వెళ్లి సిబ్బంది పనితీరును పరిశీలించారు. అప్పట్లో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

అలాగే రైతువారి చట్టం నుంచి దేవాదాయ భూముల మినహాయింపు చట్టాన్ని ప్రవేశపెట్టారు. సేద్యానికి పనికిరాని భూములు అమ్మి, ఆ సొమ్మును దేవాలయాల పేరున ఫిక్సిడ్ డిపాజిట్ చేసి భగవంతునికి ధూప, దీప నైవేద్యాలకు ఏర్పాటు చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన శివరామరాజు కలత చెంది రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

సీఎం సంతాపం
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దండు శివరామరాజు మృతిపట్ల సీఎం రోశయ్య విచారం వ్యక్తం చేశారు.

ఆయన సేవలు మరువలేనివి: చంద్రబాబు
మాజీ మంత్రి దండు శివరామరాజు సేవలు మరువలేనివని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని చంద్రబాబు పేర్కొన్నారు.

ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి...:మాజీ మంత్రి ఉమ్మారెడ్డి
ఉన్నత విలువలు పాటించిన ఆదర్శ వ్యక్తి దండు అని టీడీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభివర్ణించారు.

'దండు'కు టీడీపీ నేతల ఘననివాళులు
టీడీపీ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, వర్ల రామయ్య, తొండపి దశరథ జనార్ధన్, పీఆర్ మోహన్, బాలసాని లక్ష్మీ నారాయణ, సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు.

సమాజ అభివృద్ధికి శివరామరాజు తపన పడేవారు: కంతేటి
మాజీ మంత్రి దండు శివరామరాజు సమాజ అభివృద్ధి కోసమే నిరంతరం తపన పడేవారని, ఆయన మృతి రాష్ట్ర ప్రజలకు తీరని లోటని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు అన్నారు. తామిద్దరమూ మూర్తిరాజు శిష్యులమని, ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు.

మాజీ మంత్రి 'దండు' మృతికి పలుపురి నివాళి

మాజీ మంత్రి దండు శివరామరాజు చికిత్స పొందుతూ మృతి చెందడంతో స్వగ్రామమైన పెనుమంట్ర మండలం పొలమూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. పొలమూరులో జన్మించిన శివరామరాజు అక్కడే విద్యనభ్యసించి మూర్తిరాజు విద్యాలయాల్లో వ్యాయమోపాద్యాయుడిగా ఉద్యోగం చేపట్టిన దండు శివరామరాజు విద్యార్థి దశ నుంచి నాయకత్వం లక్షణాలు కలి గి సంపూర్ణ నాయకునిగా ఎదిగారు.

రాజకీయ దురంధరుడు, చిరునవ్వుల దండు శివరామరాజు మృతితెలుగుదేశం పార్టీకి తీరని లోటనీ పెనుమంట్ర టీడీపీ మండల అధ్యక్ష్య, కార్యదర్శులు తమనంపూడి శ్రీనివాసరెడ్డి, వీరవల్లి శ్రీధర్, గాంది, కోయ నాగపోరాజు, కలిదిండి మహేష్‌రాజు, పెచ్చె ట్టి ఏడుకొండలు, పెనుగొండ అరుణప్రసాద్, మాజీ ఎంపీపీ తమనంపూడి కమలకుమారి, మండల టీడీపీ మహి ళా అధ్యక్షురాలు కడలి సత్యవాణి, వెలగల బుల్లిరామిరెడ్డి తదితరులు దండు శివరామరాజు మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి దండు శివరామరాజు మృతికి వివిధ పార్టీ నేతలు ఆదివారం మందలపర్రులోని ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత, పాలకొల్లు మాజీ శాసనసభ్యులు పత్సవత్సల బాబ్జి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోటసీతారామలక్ష్మీ, మాజీ రాజ్యసభ సభ్యు లు యర్రానారాయణస్వామి, మెంటే పద్మనాభం, ఎమ్మెల్సీ మల్లుల లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి ఇందుకూరిరామకృష్ణంరాజు, దేవాదాయ రిటైర్డ్ డీసీ లు రామాంజనేయరాజు, ఆనందస్వరూప్‌వర్మ, వి.నరసింహరాజు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.ఎస్.రాజు, జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మెంటే పార్దసారధి, రాష్ట్ర తెలుగు రైతు ప్రధా న కార్యదర్శి నాయుడు రామచంద్రరరావు, ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ గన్నివీరాంజనేయులు, జిల్లా సమన్వయ కార్యదర్శి నంద్యాల మదన్‌మోహన్‌లచ్చిరాజు, గణపవరం మండల పార్టీ అధ్యక్షులు నాయుడు శ్రీనివాసరావు,

కార్యదర్శి యాళ్ళసుబ్బారావు, ప్రచారకార్యదర్శి కూనసాని నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు జూ పల్లి రాజేంద్ర, ముద్రగడ మునియ్య, సంకు శ్రీనివాసరావు, నిడమర్రు ఎంపిీపీ అంబళ్ళ వెంకటేశ్వరరావు, పోసింశెట్టి రామమూర్తి, టీడీపీ నాయకులు సంకుపుల్లారావు, పీఆర్పీ నాయకులు పుప్పాలరామయ్య, కాంగ్రెస్ నాయకు లు గుడాల భుజంగరావు, గణపవరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు కూసంపూడి జగపతిరాజు, జిల్లాకాంగ్రెస్‌కార్యదర్శి నంద్యాల రామలింగరాజు, కాంగ్రెస్ నేతలు మాదిరెడ్డి సురేష్‌కుమార్, గాదిరాజు గోపాలకృష్ణరాజు, గాదిరాజు గోపాలరాజు, గాదిరాజు సుదర్శనవర్మ, గణపవరం తహసీల్దార్ ఆశీర్వాదం, ఎంఈవో సాగిరాజు పెద్దిరాజు, వీఆర్వో నాగయ్య పరిసర గ్రామాల ప్రజలు వచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

సినీ దిగ్గజం పద్మశ్రీ డీవీఎస్ రాజు

 

సినీ భీష్మ ఇకలేరు

నిస్వార్ధ సేవ, అంకితభావం కలిగిన వారు ఏ రంగంలోనైనా రాణించి గుర్తింపు తెచ్చుకుంటారనడానికి మంచి నిదర్శనం డి.వి.ఎస్.రాజు. ఆవేశానికి, ఉద్రేకానికి లోనుకాకుండా, వర్గాలకు, వైషమ్యాలకూ దూరంగా ఉండే వ్యక్తులు డి.వి.ఎస్.రాజులా కొందరే ఉంటారు. అందుకే ఆయన అజాత శత్రువు అనిపించుకున్నారు.గ్లామర్‌కు నిలయమైన చిత్రపరిశ్రమలో మచ్చలేని స్వచ్ఛమైన జీవితాన్ని గడిపిన అరుదైన వ్యక్తి డి.వి.ఎస్.రాజు.

అందుకే చిత్రపరిశ్రమలో ఆయనకున్న స్థానం ప్రత్యేకమైంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా.. అది వ్యక్తిగతమైనా, సంస్థాగతమైందైనా దాన్ని పరిష్కరించుకోవడానికి డి.వి.ఎస్.రాజు సహాయాన్ని, సహకారాన్ని కోరడం, ఆయన దాన్ని పరిష్కరించడం పరిశ్రమలో ఓ ఆనవాయితీ అయింది.ఈ సేవాదృక్పథం తన తండ్రి నుంచి వారసత్వంగా పొందారు. ఆయన పెద్దమనిషితనం అందరికీ ఓ తరగని కొండ. మరి ఇప్పుడు ఆయన ఆకస్మిక మరణంతో ఆ లోటుని భర్తీ చేయడం కష్టమేనని ఆవేదనతో అంగీకరిస్తున్నారు చిత్ర ప్రముఖులు.

వ్యక్తిగా ఆయన ఎంతో సౌమ్యులు. ఆయన చిరాకు పడటం కానీ, కోపగించుకోవడం కానీ ఎవరూ ఎరుగరు. పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎంతో ఓపికగా ఆయన పాల్గొనేవారు. ముఖ్యంగా చర్చల్లో, సంప్రదింపుల్లో ఆయన అనుసరించే వైఖరి ఇతరులకు ఆదర్శంగా ఉండేది. ఎదుటివారి వాదనని కూలంకషంగా వినడంలోనూ, తన వాదనను సవిమర్శకంగా వినిపించి, నచ్చచెప్పడంలోనూ ఆయనకున్న నేర్పు అసాధారణమైందని ఆయన సన్నిహితులు చెప్పేమాట.

ఏ పని ప్రారంభించినా క్రమశిక్షణతో, అంకితభావంతో కృషి చేసి విజయవంతంగా పూర్తి చేయగల కార్యదీక్షాదక్షుడిగా డి.వి.ఎస్.రాజు పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయన మహానటుడు ఎన్.టి.ఆర్. కు అత్యంత సన్నిహితుడు కాగలిగారు. రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎన్.టి.ఆర్. నిర్వహించిన పలు కార్యక్రమాల్లో డి.వి.ఎస్.రాజు కీలక పాత్ర వహించేవారు.

.డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై 'మంగమ్మ శపథం' చిత్రంతో ప్రారంభించి తెలుగులో 18 చిత్రాలను, హిందీలో ఒక చిత్రాన్ని నిర్మించారు. అలాగే భాగస్వాములతో కలిసి తెలుగులో 'మా బాబు', 'శ్రీకృష్ణాంజనేయ యుద్ధం', 'దేవుడులాంటి మనిషి' చిత్రాలను, తమిళంలో రెండు చిత్రాలను ఆయన నిర్మించారు. పరిశ్రమ కోసం, దాని అభివృద్ధి కోసం వెచ్చించిన సమయాన్ని కూడా చిత్రనిర్మాణరంగం మీదకు మళ్లించి ఉంటే ఆయన మరో పాతిక చిత్రాలు నిర్మించే ఉండేవారేమో. అయితే ఏ పరిశ్రమలో ఉన్నామో దాని అభివృద్దికి బాధ్యత వహించి కృషి చేయాలనే తపన ఆయనతో ఆ పని చేయించలేదు.

1965లో చలనచిత్ర పరిశ్రమ సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పుడు డి.వి.ఎస్.రాజు ముందుకు వచ్చి చిన్న నిర్మాతలను ఆదుకునేందుకు ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ సౌత్ ఇండియాను ఏర్పాటు చేసి స్థాపక కార్యదర్శిగా వ్యవహరించారు. సినీ రంగంలో ఎలాంటి అవకతవకలు ఎదురైనా వాటిని చక్కదిద్దడంలో ఆయన ముందుండి పరిష్కరించేవారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1980లో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అదే ఏడాది ఫిలిం ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ మోషన్ పిక్చర్స్ ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్ సంస్థలను విలీనం చేసి నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో కేంద్రప్రభుత్వం ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసి దాని తొలి ఛైర్మన్‌గా డి.వి.ఎస్.రాజుని నియమించినప్పుడు భారత చలనచిత్ర పరిశ్రమ ఎంతో హర్షించింది. దానికి తగ్గట్లుగానే చిత్ర పరిశ్రమలోని ఎన్నో జటిల సమస్యలను పరిష్కరించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వంలో ఎన్.ఎఫ్.డి..సి. భాగస్వామ్యంలో 'గాంధీ' చిత్రాన్ని ఆంగ్ల, హిందీ భాషల్లో నిర్మించి దాని వల్ల వచ్చిన లాభాలను పరిశ్రమలోని వృద్ధ కళాకారులకు నెలసరి భత్యం చెల్లించడానికి వినియోగించారు. ఎన్.ఎఫ్.డి.సి.కి రెండోసారి కూడా ఛైర్మన్‌గా పనిచేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛెర్మన్‌గా రెండుసార్లు పనిచేసి తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్థికి ఎంతో కృషి చేశారు.

అలాగే దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలి కార్యదర్శిగా, అధ్యక్షునిగా ఎన్నికకావడమే కాకుండా నాలుగు భాషలకు సంబంధించిన ఛాంబర్ కనుక అధ్యక్ష పదవి నాలుగు భాషల వారికి సమంగా రావడం ధర్మమని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన వారు ఒక్కో ఏడాది ఆ పదవిలో ఉండేలా నిబంధనలు మార్చి అందరికీ న్యాయం చేశారు డి.వి.ఎస్.రాజు. ఇలాంటి మంచి సంప్రదాయాలను ఎన్నో ప్రవేశపెట్టిన ఆయన్ని దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలి 1995లో 'భీష్మ' అవార్డ్‌తో ఘనంగా సత్కరించింది. నిర్మలత్వానికి, సేవాగుణానికి ప్రతీకగా నిలిచిన డి.విఎస్‌రాజు మరణం పరిశ్రమకి నిజంగా తీరని లోటే. 

సినీ దిగ్గజం పద్మశ్రీ  డీవీఎస్ రాజు

తెలుగు చలన చిత్ర రంగంలో డీవీఎస్.రాజు పేరు తెలియని వారు లేరు. నాలుగు దశాబ్దాలుగా భారత చిత్ర పరిశ్రమతో ఆయన అల్లుకుపోయారు. గులేబకావళి క«థ, గండికోట రహస్యం వంటి మహోజ్వల జానపద చిత్రాలు ఎన్నింటినో నిర్మించిన డీవీఎస్ రాజు శనివారం హైదరాబాదులో మృతి చెం దారు. ఆయన జ్ఞాపకాలు గోదావరి జిల్లా ప్రజలను వెంబడిస్తున్నాయి. రారాజుగా వెలుగొందిన డీవీఎస్.రాజు వివాద రహితుడిగా నిరాండంబరుడిగా పేరుపొందారు.

ఆయన పూర్తి పేరు దాట్ల వెం కట సూర్యనారాయణరాజు. ఆయన 1928లో జన్మించారు. ఆయన స్వగ్రా మం పోడూరు మండలం కవిటం. ఆయన తండ్రి దాట్ల బలరామరాజు, రాజకీయ దురంధరుడిగా పేరుపొందారు. 1962 నుంచి రెండు సార్లు నర్సాపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన తండ్రి వారసత్వంతో చిన్నప్పుడే ప్రతిభను పుణికిపుచ్చుకున్నారు. కాకినాడ పీఆర్ కళాశాలలో చదువు పూర్తయ్యాక వ్యా పారం నిమిత్తం మద్రాసు వెళ్లి అనూహ్యంగా సినీ పరిశ్రమలో స్థిరపడ్డారు.

1950లో సినోలితో వర్క్స్ పేరుతో వా ల్‌పోస్టర్ ముద్రణ సంస్థను ప్రారంభించారు. పిచ్చి పుల్లయ్య సినిమా పోస్టర్ ముద్రణ సమయంలోనే ఎన్టీ రామరావుతో పరిచయం కలిగింది. ఆ పరిచయంతో ఎన్‌టిఆర్ సోదరుడు త్రివిక్రమరావు ప్రారంభించిన ఎన్ఏటి సం స్థలో భాగస్వామి కావాలని కోరిన మీదట డీవీఎస్ రాజు అంగీకరించారు. ఆ బ్యానర్‌పై తోడు దొంగలు, జయసింహ, పాండురంగ మహత్యం, గులేబకావళి వంటి చిత్రాలను నిర్మించారు. 1964లో తన సొంత సంస్థ డీవీఎస్ఎన్ ప్రొడక్షన్ ప్రారంభించారు. మంగ మ్మ శపధంతో జైత్రయాత్రను ప్రారంభించారు. గండికోట ర హస్యం, గులేబకావళిక«థ, తిక్క శంకరయ్య, మాబా బు, ధనమా దైవమా, పిడుగు రాము డు వంటి 25 చిత్రాలను నిర్మించారు. 1975లో జీవన జ్యోతి సినిమా ఉత్తమ చిత్రంగా నంది అవార్డుల పంట పం డించింది. ఆయన సినీ జీవితంలో ఎన్నో అనుభవాలు పరాజయాలను ఎదుర్కొన్నారు. 1966లో దక్షిణ భార త చలనచిత్ర మండలికి గౌరవ కార్యదర్శిగా పదేళ్లు పనిచేశారు.

1977లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కృషితోనే చలనచిత్ర మండలి ఏర్పడింది. సూపర్‌స్టార్ రజనీకాంత్, చిరంజీవీ వంటి ఎందరో ఈ మండలి ప్రారంభించిన ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన వారే. డీవీఎస్‌రాజు 1978లో ఫిల్మోత్సవం నిర్వహించి అ భినందనలు పొందారు. 1984-89 మధ్య ఏబీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా పనిచేశారు. రెండోసారి 1990లో ఎన్నికయారు. ఫిలిం డెవల ప్‌మెంట్ కార్పొరేషన్ తొలి అధ్యక్షుడి గా పనిచేశారు. పేద కళాకారుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. 989లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1995లో తమిళ పరిశ్రమ గ్రిష్మా పురస్కారం పొందారు. ఆయనను పద్మశ్రీ అవార్డు వరించింది.

రాష్ట్రపతి నారాయణన్, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయు డు, దగ్గుబాటి పురందరేశ్వరి చేతుల మీదుగా పలు అవార్డులు అందుకు న్నారు. పలు హోదాల్లో చలనచిత్ర రంగానికి, కళాకారులకు, సామాజిక సేవ కార్యక్రమాలకు సహకరించారు. ఆయన మరణం పశ్చిమ వాసులను కలచివేసింది. ఆయన 1989లో పాలకొల్లులో పాల్గొన్న వ్యక్తిగత కార్యక్రమాలను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన తండ్రి బలరామరాజు పార్లమెంటు సభ్యుడిగా జిల్లా అభివృద్దికి కారకుడు అయితే సినీ పరిశ్రమలో అగ్రగణ్యుడుగా డీవీఎస్ రాజు వెలుగొందడం జిల్లాకు గర్వకారణం.

తెలుగు సినిమా భీష్ముడు ఇక లేడు !

అజాతశత్రువుకు అశ్రు నివాళి

 
dvs-raju5
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినీ నిర్మాత డీవీఎస్‌ రాజు కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. డీవీఎస్‌ రాజు 1928 డిసెంబర్‌ 13న తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో జన్మించారు. 1950 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పటి మద్రాసు మహానగరంలో ‘సినీ లితో వర్క్‌‌స’ పేరుతో సినిమా పోస్టర్లు ముద్రించే సంస్థను స్థాపించారు. పోస్టర్లు ముద్రించే సమయంలో నందమూరి తారక రామారావుతో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. దీంతో రాజు ఎన్‌ఏటీ సంస్థలో భాగస్వామిగా చేరి ‘జయసింహ’, ‘పాండురంగ మహత్యం’, ‘గులేబకావళి కథ’ వంటి పలు విజయవంతమైన చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

dvs-raju21959లో మొదలైన ఆయన ప్రస్థానం దాదాపు 30 సంవత్సరాలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది.1965లో ‘దక్షిణ భారత సినీ నిర్మాతల మండలి’ని స్థాపించి దశాబ్ద కాలం పాటు కార్యదర్శిగా సేవలందించారు. అంతేగాక అప్పట్లో మద్రాసులో ఆయన నెలకొల్పిన ఫిలిం ఇనిస్టిట్యూట్‌లోనే చిరంజీవి, రజనీకాంత్‌, రాజేంద్రప్రసాద్‌ లాంటి ఎందరో హీరోలు నటనాభ్యాసం చేసారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనేక చిత్రాలు నిర్మించి ఉన్నత స్థాయికి ఎదిగారు. తెలుగులో అనేక సినిమాలు నిర్మించి అవార్డులు అందుకు న్నారు.1988లో రాష్ట్రప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో మరియు 2001లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతోనూ డీవీఎస్‌ రాజును సత్కరించాయి.

dvs-raju4 ఏపీ ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షునిగా మరియు నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చెర్మన్‌గా పనిచేశారు. 1980లో ఎన్‌.ఎఫ్‌.డి.సి. ద్వారా మృణాల్‌సేన్‌, గౌతంఘోష్‌, శ్యాంబెనగల్‌, నిహలానీ వంటి ఎందరో జాతీయ ఉత్తమ దర్శకులతో సినిమాలు నిర్మించేలా చేశారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఆటెన్‌బరో ‘గాంధీ’ చిత్రం చాలాకాలం పాటు నిర్మాణానికి నోచుకోకుండా ఉన్న దశలో డి.వి.ఎస్‌.రాజు చొరవతో అది అంతర్జాతీయ సినిమాగా రూపుదిద్దుకోవడం విశేషం. 1980లో హైదరాబాద్‌లో ఫిల్మోత్సవాన్ని తన హయాంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. డీవీయస్‌ రాజు పార్ధీవ దేహానికి చిత్ర ప్రముఖులు నివాళులు అర్పించారు.

dvs-raju1
ఫిలింనగర్‌లోని ఆయన నివాసంలో డీవీఎస్‌ రాజు భౌతికకాయానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. నివాళులు అర్పించినవారిలో అక్కినేని నాగేశ్వర రావు, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, రామోజీరావు, చిరంజీవి, అల్లు అరవింద్‌, తమ్మారెడ్డి భరద్వాజ, కైకాల సత్యనారాయణ, నిర్మాత అశోక్‌కుమార్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, నటుడు, టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు.

ఎవరూ పూడ్చలేని లోటిది !
dvs-raju3 
మాకెంతో ఆత్మీయుడు మా కుటుంబానికి ఆయన ఎంతో ఆత్మీయుడు. నాన్నగారితో సుదీర్ఘకాలం అనుబంధాన్ని కొనసాగించారు. నిర్మాతగా నాన్నగారితో ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని నిర్మించారు. పరిశ్రమలో అందరికీ ఆప్తుడుగా, మనసున్న మనిషిగా అందరి హృదయాల్నీ గెల్చుకున్న ఆయన మరణం అందరికీ బాధాకరం. - బాలకృష్ణ  
 

డి.వి.ఎస్‌.రాజుతో నాకెంతో ఆత్మీయ అనుబంధం ఉంది. అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకునే మంచి మనసున్న వ్యక్తి.
-డాఅక్కినేని నాగేశ్వరరావు

పరిశ్రమలో అందరి ఉన్నతిని కాంక్షిస్తూ..ఆజాత శత్రువుగా నిలిచిన వ్యక్తి డి.వి.ఎస్‌.రాజు. నేను పరిశ్రమలోకి రావడానికి ఆ రోజుల్లో ఎంతో ప్రోత్సాహమిచ్చారు.
-డాదాసరి నారాయణరావు

చలన చిత్ర పరిశ్రమకు ఎన్నో సలహాలిచ్చి ముందుకు నడిపించిన వ్యక్తి డి.వి. ఎస్‌.రాజు. ఆయన విలువైన సలహాలు చలన చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు ఎంతగానో ఉపకరించాయి.
-డాడి.రామానాయుడు


dvs-raju 
ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే గొప్ప మనసున్న వ్యక్తి డి.వి.ఎస్‌.రాజు. మద్రాస్‌ లో నటశిక్షణలో ప్రవేశించినప్పుడు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.
-చిరంజీవి

మనసున్న మనిషి రాజుతో నాకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకునే మనసున్న మనిషి. ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ ఓ పెద్ద దిక్కుని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.- అక్కినేని నాగేశ్వరరావు 

అందరికీ ఆప్తుడు పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా ముందుండి దాని పరిష్కారానికి చొరవ తీసుకునేవారు. ఆయనిచ్చిన సలహాలు పరిశ్రమకి ఎంతో ఉపకరించాయి. అందరికీ ఆప్తుడుగా మంచి పేరు సంపాదించుకున్నారు. చిత్రసీమకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. - డాక్టర్ డి. రామానాయుడు 

అజాతశత్రువు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు డి.వి.ఎస్. రాజు చేసిన సేవలు ఎనలేనివి. నేను చిత్ర పరిశ్రమలోకి రావడానికి ఆయన ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు. పరిశ్రమలో అందరి ఉన్నతిని కాంక్షిస్తూ అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన లేని లోటు పూడ్చలేనిది.  - దాసరి నారాయణరావు

నాలాంటి వాళ్లకు స్ఫూర్తి మద్రాసులో నేను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన కొత్తలో నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ప్రతిభకు విలువనిచ్చి ప్రోత్సహించే గొప్ప మనసు ఆయన సొంతం. నాలాంటి వాళ్లెందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మృతి పరిశ్రకు తీరని లోటు.- చిరంజీవి 


భారతీయ సినిమాకి సేవ ఆయనతో మా కుటుంబానికి ఆత్మీయ అనుబంధం ఉంది. మా నాన్నగారికి ఎంతో సన్నిహితులు. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు మరపురాని సేవలందించారు. ఇటీవల ఆయన కుమారుడి మరణం ఆయన్నెంతో కుంగదీసింది. చిత్ర పరిశ్రమలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధాకరం. - అల్లు అరవింద్ 

పేరమ్మని నేనే రాజుగారు నిర్మించిన 'ప్రెసిడెంటు పేరమ్మ' చిత్రంలో నేను కథానాయికగా నటించా. ఎప్పుడు కనిపించినా 'పేరమ్మా' అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. ఆ పిలుపు ఇంక వినలేనని తెలిసి హృదయం భారమవుతోంది. - కవిత 

ఆద్యుడు ఆయనే - రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు కృషిచేసిన వ్యక్తుల్లో రాజుగారు ప్రముఖులు. 1978లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయనే. తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమాకి చేసిన సేవలకు గాను ఎన్నో పురస్కారాల్నీ, గౌరవాల్నీ ఆయన అందుకున్నారు. ఆయన కృషి మూలంగానే సౌంత్ ఇండియన్ ఫిల్మ్‌చాంబర్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటై ఎంతోమంది పేరుపొందిన సినీ కళాకారుల్ని తయారుచేసింది.

భారతదేశపు అత్యున్నత సినిమా సంస్థ నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎన్.ఎఫ్.డి.సి.)కు తొలి ఛైర్మన్ రాజుగారే. రెండు సార్లు ఆ పదవిలో కొనసాగి, దానికి గౌరవాన్ని తెచ్చిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలందుకున్న 'గాంధీ' చిత్రాన్ని సర్ రిచర్డ్ అటెన్‌బరోతో కలిసి ఎన్.ఎఫ్.డి.సి. నిర్మించింది ఆయన హయాంలోనే. అదే సంస్థలో సినీ కళాకారుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది కూడా ఆయన ఆధ్వర్యంలోనే కావడం గమనార్హం. ఆయన మరణంతో భారతీయ సినిమా ఓ ధృవతారని కోల్పోయింది. 
-కె. రామసుబ్బారెడ్డి, ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడు. 

పరిశ్రమ తరలింపులో ప్రముఖ వ్యక్తి తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలిరావడానికి కృషి చేసిన వ్యక్తుల్లో రాజుగారు ప్రముఖులు. పరిశ్రమలోని వ్యక్తులకు సేవ చేసేందుకు, వారు సేద తీరేందుకు ఉద్దేశించిన ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్.ఎన్.సి.సి.) ప్రారంభమైంది ఆయన ఆధ్వర్యంలోనే. ఆయన లేని లోటు ఏనాటికీ తీరనిది.  
                                                                                                                          -ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ సభ్యులు

Monday, October 25, 2010

రక్త చరిత్ర ...



మనం పుట్టించకపోతే పదాలెలా పుడతాయి...ఆర్ జీ వీ సినిమా తీయకపోతే మనమేం మాట్లాడుకుంటాము. మామూలు మనుష్యులకొచ్చే ఆలోచనలు ఆయనకి రావనుకుంటా. దేవుడంటే నమ్మకం లేదు(ట). దెయ్యాలుంటాయో లేదో తెలీదు(ట). ఇలా చాలా ఉన్నాయి. శివ సినిమాతో ఇండస్ట్రీలోకొచ్చి ...కాల క్రమేణా కొన్ని సినిమాలు తీసి..కొండపై స్వామి వారి కిరీటం కొట్టేసే లెవల్లో అద్భుతమైన సినిమాలు తీసి..అందులో దేవుడున్నాడు అని చెప్పాడో లేదని చెప్పాడో అర్ధం కాలేదు.సడెన్ గా చక్రం అదీ వస్తుంది..మరి.. ఎవరి మీదో అలిగి..తెలుగు సినిమాకు దూరమైనాడు..

తరువాత ఫాక్టరీ ఒకటి పెట్టాడు.. కానీ అందులోంచి పొల్యూషను..వ్యర్ధ పదార్ధాలే ఎక్కువ వచ్చి అసలు ఉపయోగపడే ప్రోడక్ట్లు తక్కువ వచ్చినాయి. అని ఆయనదే ఉవాచ. నాకిష్టమొచ్చినట్టు తీస్తా చూస్తే చూడండి ...లేక పోతే లేదు.. అని ధైర్యంగా చెప్పగల దమ్మున్న ప్రొడ్యూసర్..డైరెక్టర్...ఆయన తీసిన దెయ్యం సినిమాలు...ఒక్కళ్ళే చూడగలిగితే ప్రైజ్ ఇస్తానన్నట్టుగానే ఆయన తీసిన ఆగ్ లాంటి సినిమాలు ఆయనొక్కడే లేదా ధియేటర్ మొత్తం మీద ఒక్క ప్రేక్షకుడే చూసిన సందర్భాలూ ఉన్నాయి.

Friday, October 22, 2010

రామ్ గోపాల్ వర్మ ... రక్తచరిత్ర ...

 

 
రక్త చరిత్రలో ఎన్టీఆర్ విలనా?
రామ్ గోపాల వర్మ రక్తచరిత్ర సినిమా విషయంలో కొత్త కోణం ముందుకు వచ్చింది. ఇది కొత్త వివాదం కూడా. రాజకీయాల్లోనే కాకుండా సినిమాల్లో కూడా తిరుగులేని వ్యక్తిగా ఎదిగిన ఎన్టీఆర్ పై వర్మ సినిమాలో బురద చల్లారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమాపై తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఎన్టీఆర్ పాత్రను వ్యతిరేకంగా చిత్రించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ప్రముఖ హిందీ నటుడు శతృఘ్న సిన్హా పోషించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ప్రజా దేశం పార్టీగా మార్చారు. ఎన్టీ రామారావు తన పార్టీలోకి పరిటాల రవిని ఆహ్వానిస్తారు. ఈ సంఘటన ఉంది. ఎన్టీ రామారావును పూర్తిగా నెగెటివ్ క్యారెక్టర్ గా చిత్రించారు. ఓబుల్ రెడ్డిని హత్య చేయడానికి పరిటాల రవిని ఎన్టీఆర్ ను ఆహ్వానించినట్లుగా ఉంది.

రౌడీలను చంపడానికి రౌడీయే కావాలని ఎన్టీఆర్ అన్నట్లుగా సినిమాలో ఓ దృశ్యం ఉంది. ఓబుల్ రెడ్డి హత్య కూడా ఎన్టీఆర్ కనుసన్నల్లోనే జరిగిందనే అర్థం వచ్చే దృశ్యం సినిమాలో ఉంది. ఎన్టీఆర్ వద్ద పరిటాల రవి అనుచరులు గోల గోల చేసినట్లు కూడా ఉంది. ఎన్టీ రామారావును ఇప్పటి వరకు రాజకీయాల్లో గానీ సినిమాల్లో గానీ వ్యతిరేకంగా చూపిన సంఘటనలు, సందర్భాలు లేవు. ఓ మహాపురుషుడిగానే ఎన్టీ రామరావును చూస్తూ వస్తున్నారు. అయితే, ఒక్కసారిగా ఎన్టీ రామారావును రామ్ గోపాల్ వర్మ విలన్ గా చూపించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ పాత్రను చిత్రీకరించిన తీరుపై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను కోర్టుకెక్కుతానని ఆమె చెబుతున్నారు. పరిటాల రవి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ముందు చాలా కష్టాలు పడ్డారని ఆమె చెప్పారు. పార్టీలోకి రావడానికి ముందు పరిటాల రవి చాలా ఇబ్బందులు పడ్డారని ఆమె అన్నారు. తానే పరిటాల రవిని పిలిపించానని, అన్నీ మాట్లాడిన తర్వాతనే పార్టీలో చేర్చుకున్నామని ఆమె చెప్పారు. పాత్ర చిత్రీకరణలో వర్మ కనీస మర్యాద కూడా పాటించలేదని ఆమె అంటున్నారు. వర్మను ఆమె చండాలుడిగా అభివర్ణించారు. వర్మకు ధైర్యం ఉంటే తనతో మాట్లాడాలని ఆమె సవాల్ చేశారు. రామ్ గోపాల వర్మ నీచుడని ఆమె అన్నారు. తాను సినిమా చూడబోనని చెప్పారు. మొత్తం మీద, ఎన్టీఆర్ పాత్ర చిత్రీకరణపై తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్ మర్డర్ చేయించడానే పద్ధతిలో వర్మ చిత్రించారు.

రక్త చరిత్ర భాష్యం: ఎన్టీఆర్  విలన్, వైయస్సార్ హీరో?

 రక్త చరిత్ర సినిమాలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును రామ్ గోపాల్ వర్మ ప్రతినాయకుడిగా చూపించడం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వర్మపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్టీఆర్ కు ప్రజల్లో ఎనలేని అభిమానం ఉంది. ఎన్టీఆర్ ఇమేజ్ కు తిరుగులేదు. పేదల పాలిటి పెన్నిధిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. రెండు రూపాయలకు కిలోబియ్యం వంటి పథకాలు చేపట్టి పేద ప్రజల మన్ననలు పొందారు. ఆయనను అపర కృష్ణుడిగా పూజించే వారున్నారు. ఆయన పోషించిన పౌరాణిక పాత్రలు అనన్య సామాన్యమైవనే పేరుంది. ఈ స్థితిలో రామ్ గోపాల్ వర్మ ఓ మిత్ ను ఛేదించినట్లు రక్త చరిత్ర సినిమాలో ఎన్టీఆర్ పాత్రను నెగెటివ్ గా చూపించారు. అది తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తుందని చెప్పలేం. కానీ కాంగ్రెసుకు ఏదో మేరకు లాభం చేకూరుస్తుందని మాత్రం నమ్ముతున్నారు. అది కూడా, వైయస్ రాజశేఖర రెడ్డి ని ఆయన కుమారుడితో పాటు కాంగ్రెసులోని చాలా మంది నాయకులు మహా నేతగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రక్తచరిత్ర సినిమా వచ్చింది.

నిజానికి, చాలా కాలంగా ఎన్టీఆర్ కీర్తిప్రతిష్టలకు వైయస్సార్ ను అడ్డు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రచారం చేస్తూ ఎన్టీఆర్ కు ఉన్న ఆదరణను తగ్గించే ప్రయత్నాలు జరిగాయి. వైయస్సార్ వంటి నేత లేరంటూ ఆయన కుమారుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఊరూరూ తిరిగి చెబుతున్నారు. ఎన్టీఆర్ తర్వాత రాష్ట్రంలో ప్రజల ఆదరణను చూరగొన్న నాయకుడు వైయస్సార్ మాత్రమేనని చెప్పాలి. అయితే, వైయస్సార్ కు ఫాక్షనిజం మచ్చ ఉంది. రక్తచరిత్రలో ఓ ప్రధాన పాత్ర అయిన మద్దెలచెర్వు సూరికి వైయస్సార్ ఆండదండలు పుష్కలంగా ఉండేవని అంటారు. తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్య కూడా వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. వైయస్సార్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం నాయకులను ఫాక్షనిజానికి పేరు మోసిన రాజశేఖర రెడ్డి చంపిస్తున్నాడంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడ పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చారు కూడా. రామ్ గోపాల వర్మ రక్త చరిత్ర -2లో వైయస్సార్ పాత్ర ఉందా అనేది ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న. వైయస్సార్ పాత్ర ఉంటే అది ఉదాత్తంగా ఉంటుందా, ఫాక్షనిజం మచ్చ ఉన్న వ్యక్తిత్వంగా ఉంటుందా అనేది కూడా చర్చనీయాంశమే. వైయస్సార్ ను మహానేతగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఎన్టీఆర్ ను రక్త చరిత్రలో విలన్ గా చూపించారా అనేది సందేహించాల్సిన విషయం. ఆదరణ విషయంలో, ఇమేజ్ విషయంలో దివంగత నేత వైయస్సార్ కు ఎన్టీ రామారావే పోటీ. ఇది కమ్మ, రెడ్ల ఆధిపత్య వ్యవహారాలకు సంబంధించిందా అనేది కూడా చర్చనీయాంశమే.

వర్మ చేసిన తప్పేమిటి?

రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర అనూహ్య రీతిలో కొత్త వివాదం చెలరేగింది. సినిమా విడుదలకు ముందు వివాదం రేగడానికి అవకాశం ఉన్న సంఘటనలపై తీవ్ర దుమారం రేగుతూ వచ్చింది. అయితే, సినిమా విడుదలయ్యాక అనూహ్యమైన వివాదం ముందుకు వచ్చింది. సినిమా విడుదలయ్యే వరకు తెలుగుదేశం పార్టీ కోణం ముందుకు రాలేదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పాత్రపై ఏ విధమైన అనుమానాలు కలగలేదు. ఓబుల్ రెడ్డిని నెగిటివ్ గా, విలన్ గా చూపించారనే ప్రచారంపై తీవ్ర దుమారం చెలరేగింది. మద్దెలచెర్వు సూరి, పరిటాల రవిలను హీరోగా చిత్రీకరించారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ, తీరా సినిమా విడుదలయ్యే సరికి ఎన్టీఆర్ పాత్రపై దృష్టి మళ్లింది. ఎన్టీఆర్ ను విలన్ గా, కమెడియన్ గా చూపించడంతో వర్మపై తీవ్ర వ్యాఖ్యలు మొదలయ్యాయి. అనంతపురం జిల్లాలోని తెలుగుదేశం కార్యకర్తలు వర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ ను వెధవగా, బ్రోకర్ గా అభివర్ణిస్తున్నారు. అనంతపురం జిల్లా పరువు తీసే విధంగా సినిమా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. పరిటాల రవి చేసిన హత్యల వెనక ఎన్టీఆర్ పాత్ర ఉందనే విధంగా సినిమాలో వర్మ చిత్రించడాన్ని వారు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఎన్టీ రామారావును కించపరచారని అంటున్నారు. వర్మ సినిమాపై ఆందోళనకు సిద్ధపడుతామని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. పరిటాల రవిని కూడా నెగిటివ్ గా చూపించారని మండిపడుతున్నారు. వర్మ తెలుగుదేశం పార్టీకి నష్టం చేసే విధంగా సినిమా తీశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాగా, మీడియాపై కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్, వల్లభనేని వంశీ వంటి తెలుగుదేశం నాయకులు వర్మకు మీడియా విశేషంగా ప్రచారం కల్పించడాన్ని తప్పు పట్టారు. వర్మను మేధావిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వర్మ సైకో అని వంశీ అన్నారు. మీడియా ఇంటర్వ్యూల్లో కాలు మీద కాలేసుకుని నిర్లక్ష్యంగా వర్మ వ్యవహరించారని, రక్తచరిత్రకు అనవసరమైన ప్రచారం కల్పించారని దుమ్మెత్తి పోస్తున్నారు. ముంబైలో తీవ్రంగా అప్పుల పాలై రక్తచరిత్రతో తెలుగు సినిమా రంగంలోకి మళ్లీ వచ్చారని అంటున్నారు.

ప్రస్తుత స్థితిలో వర్మ రక్తచరిత్ర సినిమాకు రాజకీయ కష్టాలు మొదలయ్యే ప్రమాదం ఉంది. నిజానికి, తన తండ్రి ప్రధాన పాత్రగా పరిటాల రవి శ్రీరాములయ్య చిత్రం తీశారు. ఆ సినిమా విశేషంగా నడిచింది. ఆ పాత్రనే రక్తచరిత్ర మొదటి భాగంలో వస్తోంది. అది వాస్తవిక కల్పిత గాధగా మనకు కనిపిస్తుంది. కానీ, రక్తచరిత్రలో సృజనాత్మక కల్పన మరుగునపడిపోయి వక్రీకరణ జరిగిందనేది ప్రధాన అభిప్రాయంగా కనిపిస్తోంది. గాయం సినిమా కూడా విజయవాడ రాజకీయాలను ప్రధానం చేసుకుని నడుస్తుంది. అందులోనూ కల్పన ఉంది. సినిమా చివరికి వచ్చే సరికి ఆ సినిమాలో కూడా వక్రీకరణ జరిగింది. వక్రీకరణకు కల్పనకు మధ్య తేడాను గుర్తించకపోవడంతో వర్మ చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది.

రక్త చరిత్రతో రాయలసీమలో మళ్లీ ఫాక్షనిజం పెరుగుతుందా?

రామ్ గోపాల వర్మ రక్త చరిత్ర విడుదల నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, అనంతపురం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తీవ్ర వివాదాల మధ్యనే ఆ సినిమా విడుదలవుతోంది. హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి, ప్రత్యర్థి మద్దెలచెర్వు సూరి మధ్య నడిచిన ఫాక్షనిజాన్ని ఇతివృత్తంగా తీసుకుని రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రతీకారాలు, హత్యలు, దాడులు, ప్రతిదాడులు వంటి హింసాత్మక సంఘటనలతో సినిమా నిండి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. వర్మ సినిమాల్లో హింస, సెక్స్ ప్రధాన విషయాలుగా ఉంటాయి కాబట్టి అనంతపురం జిల్లా ఫాక్షనిజం నచ్చిందని, అందుకే రక్త చరిత్ర సినిమా మొత్తం హింస నిండి ఉంటుందని అనుకుంటున్నారు. ట్రయలర్స్ ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. మద్దెలచెర్వు సూరి, పరిటాల రవి - ఇద్దరినీ సినిమాలో హీరోగా చూపిస్తారని, తమ సోదరుడిని విలన్ గా చూపిస్తున్నారని ఓబుల్ రెడ్డి సోదరి ఉమాదేవి చాలా కాలంగా మండిపడుతున్నారు. ఆమె విమర్శలను రామ్ గోపాల వర్మ తిప్పికొడుతున్నారు. ఎవరైనా సినిమా చూసిన తర్వాతనే మాట్లాడాలని ఆయన అంటున్నారు.

రక్త చరిత్ర పాతగాయాలను తట్టి లేపుతుందని, దాని వల్ల అనంతపురం జిల్లాలో ఫాక్షనిజం మళ్లీ పెరుగుతుందని కొంత మంది వాదిస్తున్నారు. బిజెపి నాయకులు ఆ మాటే అంటున్నారు. మాజీ నక్సలైట్ కిష్టప్ప భార్య భూలక్ష్మి కూడా అదే మాట అంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. రేపు శుక్రవారం సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రక్త చరిత్ర సినిమా పోస్టర్లు థియేటర్ల వద్ద తప్ప ఎక్కడా కనిపించడం లేదు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సినిమాను సినిమాగా చూడాలని జిల్లా ఎస్పీ ఎం కె సింగ్ ప్రజలకు విజ్ఝప్తి చేస్తున్నారు. ఎంకె సింగ్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మద్దెలచెర్వు సూరి, పరిటాల రవి వంటి వారిని మోడల్ గా మాత్రమే తీసుకున్నానని, ఇతివృత్తం మాత్రం కల్పితమని, వాస్తవం కాదని రామ్ గోపాల్ వర్మ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా ప్రివ్యూకు ఆయన మద్దెలచెర్వు సూర్యనారాయణ కుటుంబాన్ని, తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత కుటుంబాన్ని ఆహ్వానించినట్లు సమాచారం. మద్దెలచెర్వు సూరితో కలిసి రామ్ గోపాల్ వర్మ అనంతపురంలో సినిమా చూడడానికి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అనంతపురంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మద్దెలచెర్వు సూరితో కలిసి బెంగళూర్ లో సినిమా చూడడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రక్త చరిత్ర సినిమాపై మీడియా తీవ్రమైన ఉత్కంఠను, ఉద్విగ్నతను పెంచుతోంది. ఎప్పటికప్పుడు వివాదాలను వెలికి తీస్తూ పెద్ద యెత్తున టీవీ చానెళ్లు వార్తాకథనాలను ప్రసారం చేస్తున్నాయి. ప్రత్యేక చర్చా కార్యక్రమాలను పెడుతున్నాయి. రామ్ గోపాల వర్మతో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశాయి. ఆయనతో చర్చాగోష్టులు నిర్వహించాయి.

రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర ఎవరి కోసం తీశారు?

ప్రముఖ దర్శకుడు రక్త చరిత్ర సినిమాను ఎవరి కోసం తీశారనే ప్రశ్న విడుదల సందర్భంలో ప్రధానంగా ముందుకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మద్దెలచెర్వు సూరికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యం ఈ ప్రశ్న రావడానికి ప్రధాన కారణం. మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరికి అనుకూలంగానే వర్మ రక్తచరిత్ర తీసినట్లు ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించాలని సూరి అనుకుంటున్నారని, అందుకు అనుగుణంగానే సూరిని సినిమాలో హీరోగా చూపించే ప్రయత్నం చేశారని అంటున్నారు. సినిమాకు పెట్టుబడి కూడా సూరి పెట్టినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పరిటాల రవిని విలన్ గా చూపిస్తే ఆయన శిబిరం మండిపడుతుందనే భయం కూడా వర్మకు ఉందని అంటున్నారు. దీంతో సినిమాలో సూరిని, రవిని రెండు వైపులా పెట్టి ఆ ఇద్దరిని హీరోలుగా చూపించినట్లు చెబుతున్నారు.

కాగా, ఓబుల్ రెడ్డిని విలన్ గా చిత్రీకరించినట్లు చెబుతున్నారు. సూరి, రవి, ఓబుల్ రెడ్డిలకు చెందిన మూడు కుటుంబాల కథలో ఓబుల్ రెడ్డిని రేపిస్టుగా, గొంతులు కోసే కిరాతకుడిగా, నానా అవలక్షణాలున్న ప్రతినాయకుడిగా చూపించినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఓబుల్ రెడ్డి సోదరి ఉమాదేవి మండిపడుతున్నారు. తన సోదరుడు రేప్ కేసులో నిందితుడు కాడని, సూరి తమ్ముడే రేప్ కేసులో ఉన్నాడని ఉమాదేవి ఓ టీవీ న్యూస్ చానెల్ ప్రతినిధితో అన్నారు. ఓబుల్ రెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని వర్మ అంటున్నారు. అయితే, దీనిపై కూడా ఉమాదేవి మండిపడుతున్నారు.