పేద కుటుంబంలో పుట్టి శ్రమను, ప్రతిభను నమ్ముకుని ఒక్కొక్క మెట్టు ఎక్కి ఉన్న త శిఖరాన్ని అందుకున్న నిరంతర శ్రామికుడు, మాజీ మంత్రి దండు శివరామరాజు ఇక లేరన్న విషయాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ అతి నిరాడంబరంగా అందరి ఆత్మీయుడుగా పేరొందిన శివరామరాజు జిల్లా రాజకీయాల్లో రారాజుగా వెలుగొందారు. నిర్మొహమాటంగా, నిర్భయంగా మాట్లాడుతూ మ చ్చలేని రాజకీయ నాయకుడిగా పేరుగాంచారు.
ఆదివారం నిడమర్రు మండలం మందలపర్రులోని తన స్వగృహంలో తుది శ్వాస విడవడంతో జిల్లా ప్రజానీకం దిగ్భ్రాంతికి గురయ్యారు. జిల్లాలోని రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు దండు మృతికి తీవ్రసంతాపం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు,కార్యకర్తలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.
పేద కుటుంబంలో పుట్టి..
జిల్లా రాజకీయాల్లో 1936,జూలై14న పెనుమంట్ర మండలం పొలమూరులో పేద కుటుంబంలో పుట్టి డ్రిల్ మాస్టారుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాల్లోకి ప్రవేశించి రెండు సార్లు ఎమ్మెల్సీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. గణపవరంలోని చింతలపాటి బాపిరాజు విద్యాసంస్థల్లో పీఈటీగా పనిచేస్తూనే కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. 1974లో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయనియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై 1984వరకు రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు.
కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 1989లో అత్తిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి మాజీ మంత్రి యిందుకూరి రామకృష్ణంరాజు(కాంగ్రెస్)పై 1111ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై ఓటమి చవి చూసినా పార్టీని వెన్నంటి ఉండి 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డాల స్వామినాయుడుపై సుమారు 55వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తిరిగి 1999లో జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి నూకారపు సూర్యప్రకాశ్‌పై మూడవసారి విజయం సాధించి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో దేవాదాయ,ధర్మాదాయ శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేవాదాయ శాఖలో ఉన్న సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ దేవాలయాల అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలోఅత్తిలి నియోజకవర్గం రద్దు ఆయ్యింది. దీంతో అత్తిలి నియోజకవర్గంనుంచి చివరి మంత్రిగా దండు రికార్డుకెక్కారు. అనారోగ్యం బారిన పడిన తరువాత తన ఆస్తిలో కొంతభాగాన్ని దేవాలయాలకు తనను నమ్ముకున్న సన్నిహితులకు దానం చేశారు.
జిల్లా పార్టీ అధ్యక్షునిగా
1994 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన దండు 1995లో జిలా పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి పార్టీ పటిష్టతకు కృషి చేయడమేకాకుండా జిల్లా కేంద్రంలో టీడీపీ కార్యాలయ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు. అంతేగాక తన సొంత నియోజకవర్గం అత్తిలిలోను పార్టీకి సొంత కార్యాలయ భవనం నిర్మించి ఔరా అనిపించుకున్నారు. పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తునే 2004లోజరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరకువాడ శ్రీరంగనాధరాజుపై స్వల్ప తేడాతోఓటమి చవిచూశారు మూడు ఏళ్ల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. తదుపరి అనారోగ్యంతో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనలేకపోయారు.
దేవాలయాల ఆదాయం పెంచిన ఘనుడు
రాష్ట్రంలో దేవాదాయ భూముల కౌలుదారుల చట్టంలో మార్పులుతీసుకువచ్చిన ఘనత మంత్రిదండుదే. మంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు రాష్ట్రంలో దేవాలయాలకు 2.68లక్షల ఎకరాలనుంచి రూ.18 కోట్ల ఆదాయం లభించేది. సుప్రీంకోర్టు నుంచి కౌలుదారుచట్టంలో మార్పులు తీసుకురావడతంతో ఆదాయాన్ని గణనీయంగా సుమారుగా రూ. 500కోట్లకు పెంచగలిగారు. ఈయన హయాంలో గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించగలిగారు. దేవాలయాల్లో వసతి సౌకర్యాల కల్పనకు కృషిచేస్తూనే అవినీతి ప్రక్షాళనకు నడుం బిగించి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలతిరుపతి దేవస్థానంలోకి మారువేషంలో వెళ్లి అక్కడ క్షౌరశాలల్లో జరుగుతున్న అవినీతిని ఎండ గట్టారు. అత్తిలి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషిచేశారు.
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని పొలమూరులో 1936లో దండు వెంకట్రాజు, సుభ్రదమ్మ దంపతులకు శివరామరాజు జన్మించారు. అదే గ్రామంలో ఎస్ఎస్ఎల్‌సీ వరకు చదివారు. 1966లో పిప్పర గ్రామానికి చెందిన అరుణ ప్రభను వివాహం చేసుకున్నారు. దండు శివరామరాజు సతీమణి ఆరుణప్రభతో ఆయన నిడమర్రు మండలం మందలపర్రులో స్థిిరనివాసం ఏర్పరచుకున్నారు.
సంతానం లేని దండు అవినీతికి పాల్పడి సంపాదించాల్సిన అవసరం లేదని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. శివరామరా జు వ్యవసాయం చేయించడమంటే ఆ సక్తి చూపేవారు. శివరామరాజు తండ్రి నిరక్షరాస్యుడు కావడంతో తనను బా గా చదివించాలని, మంచి ఉద్యోగస్తుడుగా చూడాలని తన తండ్రి భావించేవారని రాష్ట్ర మంత్రి కావడం ద్వారా ఆయన కోర్కె తీర్చానని దండు చెబు తూ ఉండేవారు.
చిన్నతనం నుంచి వి ద్యాభ్యాసంతో పాటు క్రీడలపై ఆయనకు ఆసక్తి ఎక్కువ.ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో బతుకుతెరువు కోసం ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్‌కు వెళ్ళి పిీఈటీ ఉద్యోగం సంపాదించా రు. కబడ్డీ, షాట్‌పుట్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ లాంటి క్రీడల్లో ప్రావీణ్యం ఉండేదని, అదే స్ఫూర్తితో డ్రిల్‌మాస్టర్ అయ్యానని నేటికి చెబుతూ ఉండేవారు.1968లో పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో పనిచేసేటప్పుడు బాపిరాజు ధర్మసంస్థలో కార్యదర్శిగా పనిచేశారు. మూర్తిరాజు వ్యవస్థాపకులుగా ఉన్న ఈ సంస్థ ఆధ్వర్యంలో 18 విద్యాసంస్థలు ఉండేవి. దీనికి శివరామరాజు కార్యదర్శిగా వ్యవహరించారు.
ఉపాధ్యాయులకు మాత్రమే సేవచేస్తున్న తాను ఇంకా విస్తృతంగా సామాన్య ప్రజలకు బడుగు, బలహీన వర్గాలకు సేవలందించాలనే తపనతో రాజకీయంలోకి వచ్చానని అంటుండేవారు. అప్పట్లో అత్తిలిని కుప్పం నియోజకవర్గం తరహాలో అభివృద్ధి చేయాలని తలంపు పెట్టుకునేవాడినని దండు చె బుతుండేవారు. తీరిక దొరికితే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యేవారు. వ్యవసాయానికి ప్రస్తుత ఆ«ధునిక వి ధానాలు మరింత ప్రోత్సహకరంగా ఉన్నాయని ఆయన అంటుండేవారు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా తూర్పుగోదావరిజిల్లాలో ఎక్కువ కాలంపనిచేశారు. అనపర్తి, అమలాపురం, కోమరగిరిపట్నం పాఠశాలల్లో పీఈటీగా పనిచేశారు.
ప్రముఖ విద్యాసంస్థ బాపిరాజు ధర్మసంస్థ్దకు కార్యదర్శిగా పనిచేసిన దండు శివరామరాజు 1974శాసనసభ ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లా నుంచి పోటీచేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇదే క్రమంలో 1982లో కూడా పోటీచేసి రెండవసారి కూడా ఎ మ్మెల్సీగా విజయం సాధించారు. ఉపాధ్యాయుల సమస్యలపైనా, విద్యారంగ సమస్యలపైనా చట్ట సభలో ఆయన పోరాడుతూ ఉండేవారు. తన వాగ్ధాటితో, సమస్యలపై స్పందించే తీరు అందరినీ అకట్టుకునేది.
ఇలా ఆ రోజుల్లోనే ఆయన చట్ట సభల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ మక్కువతోనే 2005లో శాసన మండలి పునరుద్ధరించిన తర్వాత మరోమారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు. రాజకీయ ఉద్దండులైన మాజీ మంత్రి సర్వోదయ నా యకులు చింతలపాటిమూర్తి రాజు, అప్పటి అత్తిలి ఎమ్మెల్యే, దివంగత వేగే శ్న కనకరాజు, కింగ్‌మేకర్‌గా ఈడూరి సూర్పరాజు తమకు స్ఫూర్తి ప్రధాతల ని దండు చెబుతుంటారు.
1984లో ఎన్.టి.ఆర్. పిలుపుమేరకు దండు టీ డీపీలో చేరారు. తొలిసారిగా 1989లో అత్తిలి నుంచి టీడీపీ అభ్యర్థ్దిగా పోటీచేసి గెలుపొందారు. తొలిసారి అసెంబ్లీలో ప్రవేశించడమే కాకుండా 1989, 94 సంవత్సరాల మధ్య అసెంబ్లీలో పార్టీవిప్‌గా పనిచేశారు. 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ ఎన్నికై 2వ సారి అసెంబ్లీలో ప్రవేశించారు. 1999 శాసనసభ ఎన్నికల్లో అత్తిలి నుంచి మళ్లీ అసెంబ్లీకి ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో దేవాదాయ శాఖకు కేబినెట్ మంత్రి అయ్యారు.
వ్యక్తిగతంగా కోపిష్టిగా కనబడే దండు కోపం వచ్చినా కేకలు వేసినా మరుక్షణం పాలపొంగులా కోపం కరిగిపోతుందని ఆయన అనుచరులు, అభిమానులు చెబుతుంటారు. అప్పట్లో పనిచేయని అధికారులు నిలదీయడం, దులిపివేయడం ఆయన నైజం. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తునిగా మారు వేషంలో వెళ్లి అక్కడ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. అప్పట్లో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.
పదవిలో ఉన్నా లేకపోయినా గ్రామగ్రామాన తిరగడం, కార్యకర్తలను ప్రజలను కలుసుకోవడం అతని విలక్షణ శైలి.మోటర్‌సైకిల్, సైకిల్, పాదయాత్ర సంస్కృతిని దండు ప్రవేశపెట్టారంటే అతిశయోక్తికాదు.అలాగే దేవాదాయ శాఖా మంత్రిగా రైతువారి చట్టం నుంచి దేవాదాయ భూముల మినహాయింపుచట్టాన్ని సుప్రీంకోర్టు ద్వారా ఆయన ప్రవేశపెట్టారు.దేవాదాయ భూములు అన్యక్రాంతంకాకుండా పటిష్టపర్చడానికిఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి వెనుకడుగు వేసేవారు కాదు.దాతల ఆశయాల మేరకు ఇచ్చి న భూములను కాపడటానికి రాజీపడే ప్రశక్తిలేదని,ఇందుకోసం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఆస్తులను పరిరక్షించేందుకు జీవో తీసుకువచ్చారు.
సేధ్యానికి పనికిరాని భూములు అవసరమైతే అ మ్మి ఆసొమ్ము దేవాలయాల పేరున ఫి క్సిడ్ డిపాజిట్‌చేసి భగవంతునికి ధూ ప, దీపనైవేద్యాలకు ఏర్పాటు చేశారు. గతంలో దేవాదాయ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ముస్లింకు షాదీకనాలు, క్రైస్తువులకు చర్చిలు, హిందూ దేవాలయాల అభివృద్ధ్దికి సమర్థవంతంగా పనిచేసిన గుర్తింపు తెచ్చుకున్నారు.పెంటపాడు, మార్టేరు స్టేట్ హైవే నిర్మాణానికి రూ.32కోట్లు మంజూరుచేయించారు. స్వజలధార, డ్వాక్రా గ్రూపులు, నియోజకవర్గంలో 200సాముహికమరుగుదొడ్లను అధునాతన సాంకేతిక ప రిజ్ఞానంతో నిర్మించి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు.
రైతు సోదరులకు సౌకర్యంగా ఉండేందుకు కోమర్రు రూ.కోటి 20లక్షలతో యనమదుర్రు డ్రెయిన్‌పై వంతెన నిర్మించారు.అలాగే పిప్పర వద్ద యనమదుర్రు డ్రెయిన్‌పై కూడా నూతన వంతెన నిర్మాణానికి కృషిచేశారు.నియోజకవర్గంలో కట్టవపాడు, గణపవరం, కోముట్లపాలెం, వాకపల్లి తదితర గ్రామాల్లో ఫుట్‌పాత్ వంతెలను ఏర్పాటుచేసి రైతులను ఆదుకున్నారు. డ్రిల్‌మాస్టర్‌గా స్కూల్‌పిల్లలను బెత్తంతో అదిరిస్తూ పిరియడ్‌చేయించి డ్రిల్‌చేయించడం ఆయన వృత్తి. అయితే హైదరాబాద్‌లో జరిగిన మహానాడులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ దండుశివరామరాజు చేత డ్రిల్‌మాస్టర్ తరహలో విజిల్ ఊదు తూ చేతితో బెత్తం పట్టుకుని కార్యకర్తలకు క్రమశిక్షణతో రాజకీయ డ్రిల్‌చేయించే బాధ్యతను అప్పగించారు.
శివరామరాజు స్వార్జిత ఆస్తులను, రూ.2కోట్లు విలువచేసే 11ఎకరాల భూములను ధార్మిక సంస్థ్దలకు ధానధర్మం చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన దస్తావేజులను సంబంధిత వారికి అందించారు.తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకు వీరాభిమానం. అందుకే జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఆయన ఎకరం భూమిని రాసిఇచ్చారు. శివరామరాజు అధ్యాత్మికంగా సేవా కార్యక్రమాలుచేయడం ముందుండి పనిచేసేవారు.అలాగే ఎమ్మెల్సీగా పనిచేసిన రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.జనార్దన్‌రెడ్డి ద్వారా రూ.కోటి30లక్షలు తీసుకువచ్చి రైతుల సంక్షేమానికి వెంకయ్యవయ్యోరు మరమ్మతులు చేపట్టారు.అప్పట్లో తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అప్పటి ప్రధానీ విపి సింగ్‌ను కలిసి పంటల బీమా, నష్టపరిహరం తీసుకువచ్చి రైతు బాంధవుడిగా గుర్తుతెచ్చుకున్నారనడంలో అతిశయోక్తిలేదు.
ఆయన దేవాదాయ మంత్రిగా ఉన్నరోజుల్లో గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని రూ.25కోట్లతో అన్నిదేవాలయాలను సుందరంగా తీర్చిదిద్ది పుష్కరాలను విజయవంతం చేయడంలో ఆయనకృషిచేశారు. అవి ఇప్పటికి మరుపురాని స్మతులుగా గుర్తుండిపోయాయి. శివరామరాజు బడుగు, బలహీన వర్గాలకే గుర్తింపుతెచ్చుకున్న వ్యక్తి. ప్రజలు నేటికి మరువలేరని బలహీనవర్గాలతో పాటు దళిత, బిసి మహిళలతో దండు సేవల పట్టానేటికి మరువలేకపోతున్నారు. ఆయన భౌతికంగా మన మధ్యలేకున్నా చిత్తశుద్ధి అతని సేవలు చెరగని జ్ఞాపకాలు.

మాజీ దేవాదాయ మంత్రి శివరామరాజు కన్నుమూత
ఊపిరితిత్తుల కేన్సర్‌తో కొంతకాలంగా నిమ్స్‌లో చికిత్స
తన యావదాస్తి దానం చేసిన దండు
రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ మంత్రి దండు శివరామరాజు (74) ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యపరిస్థితి చేజారిపోవడంతో ఆదివారం ఆంబులెన్స్‌లో ఆయనను పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలంలోని స్వగ్రామం మందలపర్రుకు తీసుకొచ్చిన గంటలోపే తుదిశ్వాస విడిచారు.
శివరామరాజుకు భార్య ఉన్నారు. సంతానం లేదు. ఆయన తన యావదాస్తిని మిత్రులకు, సన్నిహితులకు, పలు దేవాలయాలకు, అత్తిలిలోని టీడీపీ కార్యాలయానికి, సుబ్రహ్మణ్యేశ్వస్వామి దేవాలయానికి దానం చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన కాలంలో సామాన్య భక్తునిలాగా మారువేషంలో తిరుమల వెళ్లి సిబ్బంది పనితీరును పరిశీలించారు. అప్పట్లో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.
అలాగే రైతువారి చట్టం నుంచి దేవాదాయ భూముల మినహాయింపు చట్టాన్ని ప్రవేశపెట్టారు. సేద్యానికి పనికిరాని భూములు అమ్మి, ఆ సొమ్మును దేవాలయాల పేరున ఫిక్సిడ్ డిపాజిట్ చేసి భగవంతునికి ధూప, దీప నైవేద్యాలకు ఏర్పాటు చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన శివరామరాజు కలత చెంది రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
సీఎం సంతాపం
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దండు శివరామరాజు మృతిపట్ల సీఎం రోశయ్య విచారం వ్యక్తం చేశారు.
ఆయన సేవలు మరువలేనివి: చంద్రబాబు
మాజీ మంత్రి దండు శివరామరాజు సేవలు మరువలేనివని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని చంద్రబాబు పేర్కొన్నారు.
ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి...:మాజీ మంత్రి ఉమ్మారెడ్డి
ఉన్నత విలువలు పాటించిన ఆదర్శ వ్యక్తి దండు అని టీడీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభివర్ణించారు.
'దండు'కు టీడీపీ నేతల ఘననివాళులు
టీడీపీ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, వర్ల రామయ్య, తొండపి దశరథ జనార్ధన్, పీఆర్ మోహన్, బాలసాని లక్ష్మీ నారాయణ, సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు.
సమాజ అభివృద్ధికి శివరామరాజు తపన పడేవారు: కంతేటి
మాజీ మంత్రి దండు శివరామరాజు సమాజ అభివృద్ధి కోసమే నిరంతరం తపన పడేవారని, ఆయన మృతి రాష్ట్ర ప్రజలకు తీరని లోటని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు అన్నారు. తామిద్దరమూ మూర్తిరాజు శిష్యులమని, ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు.

మాజీ మంత్రి 'దండు' మృతికి పలుపురి నివాళి
మాజీ మంత్రి దండు శివరామరాజు చికిత్స పొందుతూ మృతి చెందడంతో స్వగ్రామమైన పెనుమంట్ర మండలం పొలమూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. పొలమూరులో జన్మించిన శివరామరాజు అక్కడే విద్యనభ్యసించి మూర్తిరాజు విద్యాలయాల్లో వ్యాయమోపాద్యాయుడిగా ఉద్యోగం చేపట్టిన దండు శివరామరాజు విద్యార్థి దశ నుంచి నాయకత్వం లక్షణాలు కలి గి సంపూర్ణ నాయకునిగా ఎదిగారు.
రాజకీయ దురంధరుడు, చిరునవ్వుల దండు శివరామరాజు మృతితెలుగుదేశం పార్టీకి తీరని లోటనీ పెనుమంట్ర టీడీపీ మండల అధ్యక్ష్య, కార్యదర్శులు తమనంపూడి శ్రీనివాసరెడ్డి, వీరవల్లి శ్రీధర్, గాంది, కోయ నాగపోరాజు, కలిదిండి మహేష్‌రాజు, పెచ్చె ట్టి ఏడుకొండలు, పెనుగొండ అరుణప్రసాద్, మాజీ ఎంపీపీ తమనంపూడి కమలకుమారి, మండల టీడీపీ మహి ళా అధ్యక్షురాలు కడలి సత్యవాణి, వెలగల బుల్లిరామిరెడ్డి తదితరులు దండు శివరామరాజు మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి దండు శివరామరాజు మృతికి వివిధ పార్టీ నేతలు ఆదివారం మందలపర్రులోని ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత, పాలకొల్లు మాజీ శాసనసభ్యులు పత్సవత్సల బాబ్జి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోటసీతారామలక్ష్మీ, మాజీ రాజ్యసభ సభ్యు లు యర్రానారాయణస్వామి, మెంటే పద్మనాభం, ఎమ్మెల్సీ మల్లుల లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి ఇందుకూరిరామకృష్ణంరాజు, దేవాదాయ రిటైర్డ్ డీసీ లు రామాంజనేయరాజు, ఆనందస్వరూప్‌వర్మ, వి.నరసింహరాజు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.ఎస్.రాజు, జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మెంటే పార్దసారధి, రాష్ట్ర తెలుగు రైతు ప్రధా న కార్యదర్శి నాయుడు రామచంద్రరరావు, ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ గన్నివీరాంజనేయులు, జిల్లా సమన్వయ కార్యదర్శి నంద్యాల మదన్‌మోహన్‌లచ్చిరాజు, గణపవరం మండల పార్టీ అధ్యక్షులు నాయుడు శ్రీనివాసరావు,
కార్యదర్శి యాళ్ళసుబ్బారావు, ప్రచారకార్యదర్శి కూనసాని నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు జూ పల్లి రాజేంద్ర, ముద్రగడ మునియ్య, సంకు శ్రీనివాసరావు, నిడమర్రు ఎంపిీపీ అంబళ్ళ వెంకటేశ్వరరావు, పోసింశెట్టి రామమూర్తి, టీడీపీ నాయకులు సంకుపుల్లారావు, పీఆర్పీ నాయకులు పుప్పాలరామయ్య, కాంగ్రెస్ నాయకు లు గుడాల భుజంగరావు, గణపవరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు కూసంపూడి జగపతిరాజు, జిల్లాకాంగ్రెస్‌కార్యదర్శి నంద్యాల రామలింగరాజు, కాంగ్రెస్ నేతలు మాదిరెడ్డి సురేష్‌కుమార్, గాదిరాజు గోపాలకృష్ణరాజు, గాదిరాజు గోపాలరాజు, గాదిరాజు సుదర్శనవర్మ, గణపవరం తహసీల్దార్ ఆశీర్వాదం, ఎంఈవో సాగిరాజు పెద్దిరాజు, వీఆర్వో నాగయ్య పరిసర గ్రామాల ప్రజలు వచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు.