Sunday, November 14, 2010

సినీ దిగ్గజం పద్మశ్రీ డీవీఎస్ రాజు

 

సినీ భీష్మ ఇకలేరు

నిస్వార్ధ సేవ, అంకితభావం కలిగిన వారు ఏ రంగంలోనైనా రాణించి గుర్తింపు తెచ్చుకుంటారనడానికి మంచి నిదర్శనం డి.వి.ఎస్.రాజు. ఆవేశానికి, ఉద్రేకానికి లోనుకాకుండా, వర్గాలకు, వైషమ్యాలకూ దూరంగా ఉండే వ్యక్తులు డి.వి.ఎస్.రాజులా కొందరే ఉంటారు. అందుకే ఆయన అజాత శత్రువు అనిపించుకున్నారు.గ్లామర్‌కు నిలయమైన చిత్రపరిశ్రమలో మచ్చలేని స్వచ్ఛమైన జీవితాన్ని గడిపిన అరుదైన వ్యక్తి డి.వి.ఎస్.రాజు.

అందుకే చిత్రపరిశ్రమలో ఆయనకున్న స్థానం ప్రత్యేకమైంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా.. అది వ్యక్తిగతమైనా, సంస్థాగతమైందైనా దాన్ని పరిష్కరించుకోవడానికి డి.వి.ఎస్.రాజు సహాయాన్ని, సహకారాన్ని కోరడం, ఆయన దాన్ని పరిష్కరించడం పరిశ్రమలో ఓ ఆనవాయితీ అయింది.ఈ సేవాదృక్పథం తన తండ్రి నుంచి వారసత్వంగా పొందారు. ఆయన పెద్దమనిషితనం అందరికీ ఓ తరగని కొండ. మరి ఇప్పుడు ఆయన ఆకస్మిక మరణంతో ఆ లోటుని భర్తీ చేయడం కష్టమేనని ఆవేదనతో అంగీకరిస్తున్నారు చిత్ర ప్రముఖులు.

వ్యక్తిగా ఆయన ఎంతో సౌమ్యులు. ఆయన చిరాకు పడటం కానీ, కోపగించుకోవడం కానీ ఎవరూ ఎరుగరు. పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎంతో ఓపికగా ఆయన పాల్గొనేవారు. ముఖ్యంగా చర్చల్లో, సంప్రదింపుల్లో ఆయన అనుసరించే వైఖరి ఇతరులకు ఆదర్శంగా ఉండేది. ఎదుటివారి వాదనని కూలంకషంగా వినడంలోనూ, తన వాదనను సవిమర్శకంగా వినిపించి, నచ్చచెప్పడంలోనూ ఆయనకున్న నేర్పు అసాధారణమైందని ఆయన సన్నిహితులు చెప్పేమాట.

ఏ పని ప్రారంభించినా క్రమశిక్షణతో, అంకితభావంతో కృషి చేసి విజయవంతంగా పూర్తి చేయగల కార్యదీక్షాదక్షుడిగా డి.వి.ఎస్.రాజు పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆయన మహానటుడు ఎన్.టి.ఆర్. కు అత్యంత సన్నిహితుడు కాగలిగారు. రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎన్.టి.ఆర్. నిర్వహించిన పలు కార్యక్రమాల్లో డి.వి.ఎస్.రాజు కీలక పాత్ర వహించేవారు.

.డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై 'మంగమ్మ శపథం' చిత్రంతో ప్రారంభించి తెలుగులో 18 చిత్రాలను, హిందీలో ఒక చిత్రాన్ని నిర్మించారు. అలాగే భాగస్వాములతో కలిసి తెలుగులో 'మా బాబు', 'శ్రీకృష్ణాంజనేయ యుద్ధం', 'దేవుడులాంటి మనిషి' చిత్రాలను, తమిళంలో రెండు చిత్రాలను ఆయన నిర్మించారు. పరిశ్రమ కోసం, దాని అభివృద్ధి కోసం వెచ్చించిన సమయాన్ని కూడా చిత్రనిర్మాణరంగం మీదకు మళ్లించి ఉంటే ఆయన మరో పాతిక చిత్రాలు నిర్మించే ఉండేవారేమో. అయితే ఏ పరిశ్రమలో ఉన్నామో దాని అభివృద్దికి బాధ్యత వహించి కృషి చేయాలనే తపన ఆయనతో ఆ పని చేయించలేదు.

1965లో చలనచిత్ర పరిశ్రమ సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పుడు డి.వి.ఎస్.రాజు ముందుకు వచ్చి చిన్న నిర్మాతలను ఆదుకునేందుకు ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ సౌత్ ఇండియాను ఏర్పాటు చేసి స్థాపక కార్యదర్శిగా వ్యవహరించారు. సినీ రంగంలో ఎలాంటి అవకతవకలు ఎదురైనా వాటిని చక్కదిద్దడంలో ఆయన ముందుండి పరిష్కరించేవారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1980లో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అదే ఏడాది ఫిలిం ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ మోషన్ పిక్చర్స్ ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్ సంస్థలను విలీనం చేసి నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో కేంద్రప్రభుత్వం ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసి దాని తొలి ఛైర్మన్‌గా డి.వి.ఎస్.రాజుని నియమించినప్పుడు భారత చలనచిత్ర పరిశ్రమ ఎంతో హర్షించింది. దానికి తగ్గట్లుగానే చిత్ర పరిశ్రమలోని ఎన్నో జటిల సమస్యలను పరిష్కరించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వంలో ఎన్.ఎఫ్.డి..సి. భాగస్వామ్యంలో 'గాంధీ' చిత్రాన్ని ఆంగ్ల, హిందీ భాషల్లో నిర్మించి దాని వల్ల వచ్చిన లాభాలను పరిశ్రమలోని వృద్ధ కళాకారులకు నెలసరి భత్యం చెల్లించడానికి వినియోగించారు. ఎన్.ఎఫ్.డి.సి.కి రెండోసారి కూడా ఛైర్మన్‌గా పనిచేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛెర్మన్‌గా రెండుసార్లు పనిచేసి తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్థికి ఎంతో కృషి చేశారు.

అలాగే దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలి కార్యదర్శిగా, అధ్యక్షునిగా ఎన్నికకావడమే కాకుండా నాలుగు భాషలకు సంబంధించిన ఛాంబర్ కనుక అధ్యక్ష పదవి నాలుగు భాషల వారికి సమంగా రావడం ధర్మమని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన వారు ఒక్కో ఏడాది ఆ పదవిలో ఉండేలా నిబంధనలు మార్చి అందరికీ న్యాయం చేశారు డి.వి.ఎస్.రాజు. ఇలాంటి మంచి సంప్రదాయాలను ఎన్నో ప్రవేశపెట్టిన ఆయన్ని దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలి 1995లో 'భీష్మ' అవార్డ్‌తో ఘనంగా సత్కరించింది. నిర్మలత్వానికి, సేవాగుణానికి ప్రతీకగా నిలిచిన డి.విఎస్‌రాజు మరణం పరిశ్రమకి నిజంగా తీరని లోటే. 

సినీ దిగ్గజం పద్మశ్రీ  డీవీఎస్ రాజు

తెలుగు చలన చిత్ర రంగంలో డీవీఎస్.రాజు పేరు తెలియని వారు లేరు. నాలుగు దశాబ్దాలుగా భారత చిత్ర పరిశ్రమతో ఆయన అల్లుకుపోయారు. గులేబకావళి క«థ, గండికోట రహస్యం వంటి మహోజ్వల జానపద చిత్రాలు ఎన్నింటినో నిర్మించిన డీవీఎస్ రాజు శనివారం హైదరాబాదులో మృతి చెం దారు. ఆయన జ్ఞాపకాలు గోదావరి జిల్లా ప్రజలను వెంబడిస్తున్నాయి. రారాజుగా వెలుగొందిన డీవీఎస్.రాజు వివాద రహితుడిగా నిరాండంబరుడిగా పేరుపొందారు.

ఆయన పూర్తి పేరు దాట్ల వెం కట సూర్యనారాయణరాజు. ఆయన 1928లో జన్మించారు. ఆయన స్వగ్రా మం పోడూరు మండలం కవిటం. ఆయన తండ్రి దాట్ల బలరామరాజు, రాజకీయ దురంధరుడిగా పేరుపొందారు. 1962 నుంచి రెండు సార్లు నర్సాపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన తండ్రి వారసత్వంతో చిన్నప్పుడే ప్రతిభను పుణికిపుచ్చుకున్నారు. కాకినాడ పీఆర్ కళాశాలలో చదువు పూర్తయ్యాక వ్యా పారం నిమిత్తం మద్రాసు వెళ్లి అనూహ్యంగా సినీ పరిశ్రమలో స్థిరపడ్డారు.

1950లో సినోలితో వర్క్స్ పేరుతో వా ల్‌పోస్టర్ ముద్రణ సంస్థను ప్రారంభించారు. పిచ్చి పుల్లయ్య సినిమా పోస్టర్ ముద్రణ సమయంలోనే ఎన్టీ రామరావుతో పరిచయం కలిగింది. ఆ పరిచయంతో ఎన్‌టిఆర్ సోదరుడు త్రివిక్రమరావు ప్రారంభించిన ఎన్ఏటి సం స్థలో భాగస్వామి కావాలని కోరిన మీదట డీవీఎస్ రాజు అంగీకరించారు. ఆ బ్యానర్‌పై తోడు దొంగలు, జయసింహ, పాండురంగ మహత్యం, గులేబకావళి వంటి చిత్రాలను నిర్మించారు. 1964లో తన సొంత సంస్థ డీవీఎస్ఎన్ ప్రొడక్షన్ ప్రారంభించారు. మంగ మ్మ శపధంతో జైత్రయాత్రను ప్రారంభించారు. గండికోట ర హస్యం, గులేబకావళిక«థ, తిక్క శంకరయ్య, మాబా బు, ధనమా దైవమా, పిడుగు రాము డు వంటి 25 చిత్రాలను నిర్మించారు. 1975లో జీవన జ్యోతి సినిమా ఉత్తమ చిత్రంగా నంది అవార్డుల పంట పం డించింది. ఆయన సినీ జీవితంలో ఎన్నో అనుభవాలు పరాజయాలను ఎదుర్కొన్నారు. 1966లో దక్షిణ భార త చలనచిత్ర మండలికి గౌరవ కార్యదర్శిగా పదేళ్లు పనిచేశారు.

1977లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కృషితోనే చలనచిత్ర మండలి ఏర్పడింది. సూపర్‌స్టార్ రజనీకాంత్, చిరంజీవీ వంటి ఎందరో ఈ మండలి ప్రారంభించిన ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన వారే. డీవీఎస్‌రాజు 1978లో ఫిల్మోత్సవం నిర్వహించి అ భినందనలు పొందారు. 1984-89 మధ్య ఏబీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా పనిచేశారు. రెండోసారి 1990లో ఎన్నికయారు. ఫిలిం డెవల ప్‌మెంట్ కార్పొరేషన్ తొలి అధ్యక్షుడి గా పనిచేశారు. పేద కళాకారుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. 989లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1995లో తమిళ పరిశ్రమ గ్రిష్మా పురస్కారం పొందారు. ఆయనను పద్మశ్రీ అవార్డు వరించింది.

రాష్ట్రపతి నారాయణన్, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయు డు, దగ్గుబాటి పురందరేశ్వరి చేతుల మీదుగా పలు అవార్డులు అందుకు న్నారు. పలు హోదాల్లో చలనచిత్ర రంగానికి, కళాకారులకు, సామాజిక సేవ కార్యక్రమాలకు సహకరించారు. ఆయన మరణం పశ్చిమ వాసులను కలచివేసింది. ఆయన 1989లో పాలకొల్లులో పాల్గొన్న వ్యక్తిగత కార్యక్రమాలను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన తండ్రి బలరామరాజు పార్లమెంటు సభ్యుడిగా జిల్లా అభివృద్దికి కారకుడు అయితే సినీ పరిశ్రమలో అగ్రగణ్యుడుగా డీవీఎస్ రాజు వెలుగొందడం జిల్లాకు గర్వకారణం.

తెలుగు సినిమా భీష్ముడు ఇక లేడు !

అజాతశత్రువుకు అశ్రు నివాళి

 
dvs-raju5
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినీ నిర్మాత డీవీఎస్‌ రాజు కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. డీవీఎస్‌ రాజు 1928 డిసెంబర్‌ 13న తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో జన్మించారు. 1950 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పటి మద్రాసు మహానగరంలో ‘సినీ లితో వర్క్‌‌స’ పేరుతో సినిమా పోస్టర్లు ముద్రించే సంస్థను స్థాపించారు. పోస్టర్లు ముద్రించే సమయంలో నందమూరి తారక రామారావుతో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. దీంతో రాజు ఎన్‌ఏటీ సంస్థలో భాగస్వామిగా చేరి ‘జయసింహ’, ‘పాండురంగ మహత్యం’, ‘గులేబకావళి కథ’ వంటి పలు విజయవంతమైన చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

dvs-raju21959లో మొదలైన ఆయన ప్రస్థానం దాదాపు 30 సంవత్సరాలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది.1965లో ‘దక్షిణ భారత సినీ నిర్మాతల మండలి’ని స్థాపించి దశాబ్ద కాలం పాటు కార్యదర్శిగా సేవలందించారు. అంతేగాక అప్పట్లో మద్రాసులో ఆయన నెలకొల్పిన ఫిలిం ఇనిస్టిట్యూట్‌లోనే చిరంజీవి, రజనీకాంత్‌, రాజేంద్రప్రసాద్‌ లాంటి ఎందరో హీరోలు నటనాభ్యాసం చేసారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అనేక చిత్రాలు నిర్మించి ఉన్నత స్థాయికి ఎదిగారు. తెలుగులో అనేక సినిమాలు నిర్మించి అవార్డులు అందుకు న్నారు.1988లో రాష్ట్రప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో మరియు 2001లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతోనూ డీవీఎస్‌ రాజును సత్కరించాయి.

dvs-raju4 ఏపీ ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షునిగా మరియు నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చెర్మన్‌గా పనిచేశారు. 1980లో ఎన్‌.ఎఫ్‌.డి.సి. ద్వారా మృణాల్‌సేన్‌, గౌతంఘోష్‌, శ్యాంబెనగల్‌, నిహలానీ వంటి ఎందరో జాతీయ ఉత్తమ దర్శకులతో సినిమాలు నిర్మించేలా చేశారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఆటెన్‌బరో ‘గాంధీ’ చిత్రం చాలాకాలం పాటు నిర్మాణానికి నోచుకోకుండా ఉన్న దశలో డి.వి.ఎస్‌.రాజు చొరవతో అది అంతర్జాతీయ సినిమాగా రూపుదిద్దుకోవడం విశేషం. 1980లో హైదరాబాద్‌లో ఫిల్మోత్సవాన్ని తన హయాంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. డీవీయస్‌ రాజు పార్ధీవ దేహానికి చిత్ర ప్రముఖులు నివాళులు అర్పించారు.

dvs-raju1
ఫిలింనగర్‌లోని ఆయన నివాసంలో డీవీఎస్‌ రాజు భౌతికకాయానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. నివాళులు అర్పించినవారిలో అక్కినేని నాగేశ్వర రావు, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, రామోజీరావు, చిరంజీవి, అల్లు అరవింద్‌, తమ్మారెడ్డి భరద్వాజ, కైకాల సత్యనారాయణ, నిర్మాత అశోక్‌కుమార్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, నటుడు, టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు.

ఎవరూ పూడ్చలేని లోటిది !
dvs-raju3 
మాకెంతో ఆత్మీయుడు మా కుటుంబానికి ఆయన ఎంతో ఆత్మీయుడు. నాన్నగారితో సుదీర్ఘకాలం అనుబంధాన్ని కొనసాగించారు. నిర్మాతగా నాన్నగారితో ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని నిర్మించారు. పరిశ్రమలో అందరికీ ఆప్తుడుగా, మనసున్న మనిషిగా అందరి హృదయాల్నీ గెల్చుకున్న ఆయన మరణం అందరికీ బాధాకరం. - బాలకృష్ణ  
 

డి.వి.ఎస్‌.రాజుతో నాకెంతో ఆత్మీయ అనుబంధం ఉంది. అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకునే మంచి మనసున్న వ్యక్తి.
-డాఅక్కినేని నాగేశ్వరరావు

పరిశ్రమలో అందరి ఉన్నతిని కాంక్షిస్తూ..ఆజాత శత్రువుగా నిలిచిన వ్యక్తి డి.వి.ఎస్‌.రాజు. నేను పరిశ్రమలోకి రావడానికి ఆ రోజుల్లో ఎంతో ప్రోత్సాహమిచ్చారు.
-డాదాసరి నారాయణరావు

చలన చిత్ర పరిశ్రమకు ఎన్నో సలహాలిచ్చి ముందుకు నడిపించిన వ్యక్తి డి.వి. ఎస్‌.రాజు. ఆయన విలువైన సలహాలు చలన చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు ఎంతగానో ఉపకరించాయి.
-డాడి.రామానాయుడు


dvs-raju 
ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే గొప్ప మనసున్న వ్యక్తి డి.వి.ఎస్‌.రాజు. మద్రాస్‌ లో నటశిక్షణలో ప్రవేశించినప్పుడు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.
-చిరంజీవి

మనసున్న మనిషి రాజుతో నాకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకునే మనసున్న మనిషి. ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ ఓ పెద్ద దిక్కుని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.- అక్కినేని నాగేశ్వరరావు 

అందరికీ ఆప్తుడు పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా ముందుండి దాని పరిష్కారానికి చొరవ తీసుకునేవారు. ఆయనిచ్చిన సలహాలు పరిశ్రమకి ఎంతో ఉపకరించాయి. అందరికీ ఆప్తుడుగా మంచి పేరు సంపాదించుకున్నారు. చిత్రసీమకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. - డాక్టర్ డి. రామానాయుడు 

అజాతశత్రువు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు డి.వి.ఎస్. రాజు చేసిన సేవలు ఎనలేనివి. నేను చిత్ర పరిశ్రమలోకి రావడానికి ఆయన ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారు. పరిశ్రమలో అందరి ఉన్నతిని కాంక్షిస్తూ అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన లేని లోటు పూడ్చలేనిది.  - దాసరి నారాయణరావు

నాలాంటి వాళ్లకు స్ఫూర్తి మద్రాసులో నేను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన కొత్తలో నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ప్రతిభకు విలువనిచ్చి ప్రోత్సహించే గొప్ప మనసు ఆయన సొంతం. నాలాంటి వాళ్లెందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మృతి పరిశ్రకు తీరని లోటు.- చిరంజీవి 


భారతీయ సినిమాకి సేవ ఆయనతో మా కుటుంబానికి ఆత్మీయ అనుబంధం ఉంది. మా నాన్నగారికి ఎంతో సన్నిహితులు. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు మరపురాని సేవలందించారు. ఇటీవల ఆయన కుమారుడి మరణం ఆయన్నెంతో కుంగదీసింది. చిత్ర పరిశ్రమలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధాకరం. - అల్లు అరవింద్ 

పేరమ్మని నేనే రాజుగారు నిర్మించిన 'ప్రెసిడెంటు పేరమ్మ' చిత్రంలో నేను కథానాయికగా నటించా. ఎప్పుడు కనిపించినా 'పేరమ్మా' అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. ఆ పిలుపు ఇంక వినలేనని తెలిసి హృదయం భారమవుతోంది. - కవిత 

ఆద్యుడు ఆయనే - రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు కృషిచేసిన వ్యక్తుల్లో రాజుగారు ప్రముఖులు. 1978లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయనే. తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమాకి చేసిన సేవలకు గాను ఎన్నో పురస్కారాల్నీ, గౌరవాల్నీ ఆయన అందుకున్నారు. ఆయన కృషి మూలంగానే సౌంత్ ఇండియన్ ఫిల్మ్‌చాంబర్ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటై ఎంతోమంది పేరుపొందిన సినీ కళాకారుల్ని తయారుచేసింది.

భారతదేశపు అత్యున్నత సినిమా సంస్థ నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎన్.ఎఫ్.డి.సి.)కు తొలి ఛైర్మన్ రాజుగారే. రెండు సార్లు ఆ పదవిలో కొనసాగి, దానికి గౌరవాన్ని తెచ్చిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలందుకున్న 'గాంధీ' చిత్రాన్ని సర్ రిచర్డ్ అటెన్‌బరోతో కలిసి ఎన్.ఎఫ్.డి.సి. నిర్మించింది ఆయన హయాంలోనే. అదే సంస్థలో సినీ కళాకారుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది కూడా ఆయన ఆధ్వర్యంలోనే కావడం గమనార్హం. ఆయన మరణంతో భారతీయ సినిమా ఓ ధృవతారని కోల్పోయింది. 
-కె. రామసుబ్బారెడ్డి, ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడు. 

పరిశ్రమ తరలింపులో ప్రముఖ వ్యక్తి తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలిరావడానికి కృషి చేసిన వ్యక్తుల్లో రాజుగారు ప్రముఖులు. పరిశ్రమలోని వ్యక్తులకు సేవ చేసేందుకు, వారు సేద తీరేందుకు ఉద్దేశించిన ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్.ఎన్.సి.సి.) ప్రారంభమైంది ఆయన ఆధ్వర్యంలోనే. ఆయన లేని లోటు ఏనాటికీ తీరనిది.  
                                                                                                                          -ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ సభ్యులు

No comments: