రంగు, రంగుల కాగితాల ముక్కలను ఒకదానిపై మరొకదాన్ని అందమైన ఆకృతులను సృష్టించే రీతిలో అంటించడాన్ని పర్ కొలేజస్ అంటారు. సాధారణంగా ఇలాంటి కొలేజస్ బల్లపరుపుగా ఉంటాయి. కానీ జగదీష్ కొలేజస్ వీటికి పూర్తి భిన్నమైనవి. ఇవి త్రీ డైమెన్షనల్ తరహాలో ఉంటాయి. వసంతకాలం నుండి వేసవి కాలం వరకు వివిధ రుతువులను ప్రతిబింబించే కొలేజస్ ఇవి. పాశ్చాత్య ప్రపంచంలోని వాతావరణానికి సంబంధించినవే అయినప్పటికీ వాటిలోని అద్వితీయ నైపుణ్యం చూసే ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది.
1956లో హైదరాబాదులో జగదీష్ జన్మించారు. తండ్రి ఉద్యోగరీత్యా మహబూబ్‌నగర్ జిల్లాలోని అనేక ప్రాంతాలకు మారుతూ ఉండటంతో ఆ జిల్లాలోని గ్రామీణ జీవనం అన్ని పార్శ్వాలను ఆకళింపుచేసుకున్నారు జగదీష్. వాటిలో భాగంగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ జానపద కళారీతులను ఆ తర్వాత కళలో ఇముడ్చుకున్నాడు. జగదీష్ హైదరాబాదు, జెఎన్‌టియులో ఐదేళ్ల ఆర్ట్ డిప్లొమాను 1978లో పూర్తిచేశారు. 1980 నుండి బరోడా ఎంఎస్ విశ్వవిద్యాలయంలో మ్యూరల్ డిజైన్‌లో రెండేళ్ల పోస్ట్ డిప్లొమా చేశారు. అక్కడే కెజి సుబ్రమణియన్ లాంటి నిష్ణాతుల వద్ద శిక్షణ పొందారు.
దేశ విదేశాలలో విశేష ఖ్యాతినార్జించిన హైదరాబాదుకు చెందిన కళాకారుడు జగదీష్ చింతల. ఆయన అద్భుత కళాప్రస్థానాన్ని సూచిస్తూ ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ తన ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కొంతకాలం క్రితం ఏర్పాటు చేసిన సోలో ప్రదర్శన ప్రేక్షకులను ఆశ్చర్యంతో, ఆనందంతో తన్మయులను గావించింది. సాధారణంగా గ్యాలరీల్లో ప్రదర్శన అనగానే గోడలకు తగిలించిన అందమైన చిత్రాలు, లేదా కొలువుతీరిన శిల్పాలు మన కళ్లముందు గోచరిస్తాయి.
ఒక్కసారి ఆయన ప్రదర్శన తిలకించిన వారికి అది ఎందువల్ల సాధ్యమయిందో స్పష్టమవుతుంది.ముందుగా చూడగానే మొట్టమొదట ఆకట్టుకునేవి పేపర్ కొలేజస్. పేపర్ కొలేజస్ అంటే రంగు, రంగుల కాగితాల ముక్కలను ఒకదానిపై మరొకదాన్ని అందమైన ఆకృతులను సృష్టించే రీతిలో అంటించడం. సాధారణంగా ఇలాంటి కొలేజస్ బల్లపరుపుగా ఉంటాయి. కానీ జగదీష్ రూపొందించిన కొలేజస్ వీటికి పూర్తి భిన్నమైనవి.
ఇవి త్రీ డైమెన్షనల్ తరహాలో ఉంటాయి. వసంత కాలం నుండి వేసవి కాలం వరకు వివిధ రుతువులను ప్రతిబింబించే కొలేజస్ ఇవి. పాశ్చాత్య ప్రపంచంలోని వాతావరణానికి సంబంధించినవే అయినప్పటికీ వాటిలోని అద్వితీయ నైపుణ్యం ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. వివిధ రుతువులను సూచించే చెట్లు, ఆకులు, పుష్పాలు, వాటికి అనువైన వర్ణాలు- వాటన్నింటినీ అమర్చిన తీరు ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఇవి కాకుండా కేవలం ఒకే ఒక్క పుష్పాన్ని పెద్ద ఆకారంలో కొలేజ్‌గా రూపొందించినవి కాగితాలతో ఎంతటి అద్భుత సృష్ట్టినైనా చేయవచ్చుననడానికి ఇవి నిదర్శనాలు.
No comments:
Post a Comment