నలభై ఐదేళ్ల వయసులో ఒక మహిళ ఒంటరిగా జీవితాన్ని ఆరంభించి గెలవడం
అనుకున్నంత సులభం కాదు. అయితే అసాధ్యమూ కాదని చావళి సర్వమంగళ అంటున్నారు.
కట్టుబట్టలతో కన్నవారింట్లో అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు కొంతమందికి ఉపాధి
కల్పించే స్థాయికి ఎదిగారు. ఐఎస్బి బిజినెస్మేనేజ్మెంట్ కోర్సుకు
ఎంపికై, ఫ్యాప్సీ ఉత్తమ ఔత్సాహిక మహిళ అవార్డును కూడా అందుకున్నారు.
సర్వమంగళ జీవితంలోని చీకటి వెలుగులు ఆమె మాటల్లోనే...
ఒక భార్య ఓడిపోయేదెప్పుడు? ఇది చిన్న ప్రశ్నలా కనిపించవచ్చు కానీ నేను నిలువనీడ కోల్పోయినప్పుడు పడ్డ వేదన మాటల్లో చెప్పలేనిది. ఒక కూతురిగా నేను గెలిచాను. నా కాళ్లపై నేను నిలదొక్కుకున్నాను. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక, కాపురం కోసం అన్నీ వదులుకుని నేను నాకు కూడా మిగలకుండా అయిపోయినా సరే భార్యగా ఓడిపోయాను.
45 ఏళ్ల వయసులో ఒంటరినైపోయాను. అలాంటి సమయంలో మా నాన్నే నన్ను ఆదుకోకపోయుంటే నా బతుకు ఏమయ్యేదో!. నాన్న నుంచి ఆర్థికసహాయం అందుకుని భార్యనై కోల్పోయిన జీవితాన్ని ఒక స్త్రీగా పొందడానికి పోరాడాను.
నేల నుంచి నింగిపైకి... మాది మధ్యతరగతి కుంటుంబమైనా, ఆర్థిక సమస్యలేమీలేవు. పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపూర్ మా సొంతూరు. నాన్న పైలట్ కావడంతో నా బాల్యమంతా ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, అస్సాంలలో గడిచింది.
అస్సాంలో హోం సైన్స్ చదవుతుండగానే నాకు ఎంతో ఇష్టమైన ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం కోసం కలలు కంటూ, దానికోసం నిరంతర ప్రయత్నాలు చేస్తుండేదాన్ని. మొత్తానికి 1986 సంవత్సరంలో నా కల సాకారమయ్యింది. సెలబ్రిటీలను దగ్గరి నుంచి చూడటం, కొత్త ప్రదేశాలు తిరగడం, మంచి జీతం తీసుకోవడం...ఏదో లోకంలో గడుపుతున్నట్టుగా కాలం గడిచింది.
జవానుకో సలామ్...
ఎయిర్‌హోస్టెస్‌గా తక్కువ కాలమే చేసినా అవన్నీ మరచిపోలేని జ్ఞాపకాలగానే
ఉండిపోయాయి. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, రేఖ, సునీల్ గవాస్కర్, దేశ దేశాల
క్రికెట్ ఆటగాళ్ల పలకరింపులు...ఇవన్నీ ఎంతో థ్రిల్ కలిగించేవి. అందరికంటే
సునీల్ గవాస్కర్ మా పట్ల సహృదయత చూపేవారు. శ్రీలంకకు శాంతి సైన్యాలు
వెళ్లిన చాపర్లలో నేనూ పనిచేశాను. జవాన్లు ఎక్కడ ఉన్నారో వారికే తెలియదు.
వారంతా తమ ఇంటి చిరునామాలిచ్చి, భార్య పేరున ఉత్తరం రాయమనే వారిలా... " నేను బావున్నా. అమ్మా, నాన్నల ఆరోగ్యం జాగ్రత్త. బాబుకి ముద్దులు'' ఇంతే సమాచారం. ఇంటి వాళ్లు తిరిగి జవాబు రాయడం కోసం నా చిరునామా ఇవ్వాలని బ్రతిమాలేవారు. ఈ పని నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చినా ఎన్నో ఉత్తరాలకు ఒకే విషయం రాసేటపుడు ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగేవి కావు. తరువాత కొద్దికాలానికే వివాహం జరగడంతో ఆ జీవితాన్ని విడిచిపెట్టేయాల్సొచ్చింది.
నింగి నుంచి పాతాళంలోకి... ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగంలో చేరినపుడు నాలుగేళ్ల వరకు వివాహానికి దూరంగా ఉంటామని అంగీకార పత్రం సమర్పిస్తాము. ఒక వేళ దీన్ని ఉల్లంఘిస్తే ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందే. ఎయిర్‌హోస్టెస్‌గా మూడేళ్లు గడిచాయో లేదో మంచి సంబంధం వచ్చిందని ఇంటోవాళ్లు వివాహానికి ఒప్పించారు.అలా అస్సాంలోని ఉద్యోగ జీవితం వదిలి వివాహ జీవితంలో అడుగుపెట్టేందుకు హైదరాబాద్ వచ్చేశాను. ఏ లోటు లేకుండా పెళ్లి జరిగినా కొద్ది రోజులకే వేధింపులు మొదలయ్యాయి.

దాంతో ఆయనే ఏదైనా వ్యాపకం పెట్టుకోమనడంతో చేనేత బట్టల వ్యాపారాన్ని ఎంచుకున్నాను. మంగళగిరి, నారాయణపేట, చీర్యాల, భట్టిప్రోలుతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లి మంచి చేనేత వస్త్రాలు తీసుకువచ్చి వ్యాపారం చేశాను. ఆ పని చేసినన్ని రోజులూ ఏనాడూ నా కోసం రూపాయి కూడా తీసుకోలేదు. అదంతా కుటుంబ సేవగానే భావించాను. కానీ బయట ఎలా ఉన్నా ఇంటికెళ్లాక ఎప్పటిలాగే పరిస్థితి దారుణంగా ఉండేది.
ఒంటరి ప్రయాణంలో... వ్యవహారం చివరకు కొట్టడం వరకు వెళ్లింది. అప్పటికే ఇద్దరు పిల్లలున్నారు నాకు. చూస్తుండగానే 26 ఏళ్ల వివాహం జీవితం గడిచింది. అయినప్పటికీ దెబ్బలు తినటాన్ని భరించలేకపోయాను. అక్కడి నుంచి బయటపడిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ ఇంట్లో నా కంటూ ఏమీ మిగలలేదు. నా తరపున ఎవరూ మాట్లాడలేదు. కట్టుబట్టలతో నాన్న దగ్గరకు వెళ్లిపోయాను. నా పట్ల ఆయన అన్నిరకాల బాధ్యతలు నిర్వర్తించి ఉన్నారు. దాంతో వెళ్లాలా? వద్దా? అని సతమతమై గత్యంతరం లేనిపరిస్థితిలో ఆయన దగ్గరకే వెళ్లాను. మూడు నెలలు భారంగా గడిచాయి.
అప్పటికే చేనేత వస్త్రాలతో పరిచయం ఉండటంతో నాన్న దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకుని 2007లో 'అనఘ' చేనేత వస్త్రాల దుకాణం మొదలు పెట్టాను. పూర్వ పరిచయాల వల్ల లక్షల రూపాయల మెటీరియల్‌ను అప్పుగా ఇవ్వడానికి చేనేత కార్మికులు అంగీకరించారు.

ఇంటికి వెళితే వేదన చుట్టిముడుతుందని అనఘలోనే సమయమంతా గడిపేదాన్ని. రెండు సంవత్సరాల్లోనే నిలదొక్కుకుని ఫ్యాప్సీ ఉత్తమ ఔత్సాహిక మహిళ అవార్డుకు, ఐఎస్బీ వాళ్ల బిజినెస్మేనేజ్మెంట్ కోర్సుకు ఎంపికయ్యాను.
అమ్మాయిలకు ఆలంబన... నా దగ్గర ప్రస్తుతానికి ఇరవైమంది అమ్మాయిలు పనిచేస్తున్నారు. పెద్ద అర్హతలున్నవారికి వేరే ఉద్యోగాలు ఉన్నాయి. అందుకే నా దగ్గర ఉద్యోగం కావాలని వచ్చేవారి అర్హతలు తక్కువ ఉన్నా పట్టించుకోను. పని పట్ల వారి ఇష్టాన్నేచూస్తాను. అలా అని కేవలం పని చూసి ఊరుకోను. అమ్మాయిలకు ఆర్థిక స్వేచ్ఛ అవసరమని చెప్పి వాళ్ల జీతంలో ఎంతో కొంత సేవింగ్ చేయిస్తాను.
వాళ్లు సేవింగ్ చేస్తున్నారా? లేదా? అని ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటాను కూడా. అమ్మాయిల జీవితం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో తెలియదు కాబట్టి, వారికి ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక ప్రణాళిక అవసరమనుకుంటాను. ఇలాంటి ప్రణాళిక ఉండబట్టే కొద్దికాలంలోనే నా పిల్లలకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చగలిగాను. ఇప్పటికీ వారికి ఏది అవసరమైనా నేనే చూసుకుంటాను.

రేపటి ఉదయం కోసం... ఈరోజుతోనే అంతా సమాప్తం కాదు. అందుకు నా జీవితమే పెద్ద ఉదాహరణ అనుకుంటాను. ఏం చేయాలో తోచని పరిస్థితిలో అనఘ మొదలు పెట్టిన నేను అనుకోకుండానే షబానా అజ్మీ నటించిన "మార్నింగ్ రాగ'' సినిమాకు తొలిసారి కాస్ట్యూమ్స్ అందించాను. తరువాత దర్శకుడు వంశీ "ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు'', "దొంగరాముడు అండ్ పార్టీ'' సినిమాల కోసం, అలాగే శేఖర్ కమ్ముల తన "లీడర్, ఆనంద్'' సినిమాలకు, ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో హీరోయిన్స్‌కు కాస్ట్యూమ్స్ ఇచ్చాను. కొన్ని సినిమాల్లో తల్లి పాత్రలకు నన్ను తీసుకున్నారు కూడా. ఇలాంటివన్నీ సరదా వ్యాపకాల్లాంటివి. మంచి చేనేత వస్త్రాల నందించడమే నాకు ప్రధానం. అందుకే చాలామంది ప్రముఖులు చేనేత వస్త్రాల కోసం నన్నే సంప్రదిస్తారు. ఆ తృప్తి ఒక్కటి చాలు నాకు.

ఒక భార్య ఓడిపోయేదెప్పుడు? ఇది చిన్న ప్రశ్నలా కనిపించవచ్చు కానీ నేను నిలువనీడ కోల్పోయినప్పుడు పడ్డ వేదన మాటల్లో చెప్పలేనిది. ఒక కూతురిగా నేను గెలిచాను. నా కాళ్లపై నేను నిలదొక్కుకున్నాను. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక, కాపురం కోసం అన్నీ వదులుకుని నేను నాకు కూడా మిగలకుండా అయిపోయినా సరే భార్యగా ఓడిపోయాను.
45 ఏళ్ల వయసులో ఒంటరినైపోయాను. అలాంటి సమయంలో మా నాన్నే నన్ను ఆదుకోకపోయుంటే నా బతుకు ఏమయ్యేదో!. నాన్న నుంచి ఆర్థికసహాయం అందుకుని భార్యనై కోల్పోయిన జీవితాన్ని ఒక స్త్రీగా పొందడానికి పోరాడాను.

నేల నుంచి నింగిపైకి... మాది మధ్యతరగతి కుంటుంబమైనా, ఆర్థిక సమస్యలేమీలేవు. పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపూర్ మా సొంతూరు. నాన్న పైలట్ కావడంతో నా బాల్యమంతా ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, అస్సాంలలో గడిచింది.
అస్సాంలో హోం సైన్స్ చదవుతుండగానే నాకు ఎంతో ఇష్టమైన ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం కోసం కలలు కంటూ, దానికోసం నిరంతర ప్రయత్నాలు చేస్తుండేదాన్ని. మొత్తానికి 1986 సంవత్సరంలో నా కల సాకారమయ్యింది. సెలబ్రిటీలను దగ్గరి నుంచి చూడటం, కొత్త ప్రదేశాలు తిరగడం, మంచి జీతం తీసుకోవడం...ఏదో లోకంలో గడుపుతున్నట్టుగా కాలం గడిచింది.
జవానుకో సలామ్...
ఎయిర్‌హోస్టెస్‌గా తక్కువ కాలమే చేసినా అవన్నీ మరచిపోలేని జ్ఞాపకాలగానే
ఉండిపోయాయి. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, రేఖ, సునీల్ గవాస్కర్, దేశ దేశాల
క్రికెట్ ఆటగాళ్ల పలకరింపులు...ఇవన్నీ ఎంతో థ్రిల్ కలిగించేవి. అందరికంటే
సునీల్ గవాస్కర్ మా పట్ల సహృదయత చూపేవారు. శ్రీలంకకు శాంతి సైన్యాలు
వెళ్లిన చాపర్లలో నేనూ పనిచేశాను. జవాన్లు ఎక్కడ ఉన్నారో వారికే తెలియదు. వారంతా తమ ఇంటి చిరునామాలిచ్చి, భార్య పేరున ఉత్తరం రాయమనే వారిలా... " నేను బావున్నా. అమ్మా, నాన్నల ఆరోగ్యం జాగ్రత్త. బాబుకి ముద్దులు'' ఇంతే సమాచారం. ఇంటి వాళ్లు తిరిగి జవాబు రాయడం కోసం నా చిరునామా ఇవ్వాలని బ్రతిమాలేవారు. ఈ పని నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చినా ఎన్నో ఉత్తరాలకు ఒకే విషయం రాసేటపుడు ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగేవి కావు. తరువాత కొద్దికాలానికే వివాహం జరగడంతో ఆ జీవితాన్ని విడిచిపెట్టేయాల్సొచ్చింది.
నింగి నుంచి పాతాళంలోకి... ఎయిర్ హోస్టెస్‌గా ఉద్యోగంలో చేరినపుడు నాలుగేళ్ల వరకు వివాహానికి దూరంగా ఉంటామని అంగీకార పత్రం సమర్పిస్తాము. ఒక వేళ దీన్ని ఉల్లంఘిస్తే ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందే. ఎయిర్‌హోస్టెస్‌గా మూడేళ్లు గడిచాయో లేదో మంచి సంబంధం వచ్చిందని ఇంటోవాళ్లు వివాహానికి ఒప్పించారు.అలా అస్సాంలోని ఉద్యోగ జీవితం వదిలి వివాహ జీవితంలో అడుగుపెట్టేందుకు హైదరాబాద్ వచ్చేశాను. ఏ లోటు లేకుండా పెళ్లి జరిగినా కొద్ది రోజులకే వేధింపులు మొదలయ్యాయి.

దాంతో ఆయనే ఏదైనా వ్యాపకం పెట్టుకోమనడంతో చేనేత బట్టల వ్యాపారాన్ని ఎంచుకున్నాను. మంగళగిరి, నారాయణపేట, చీర్యాల, భట్టిప్రోలుతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లి మంచి చేనేత వస్త్రాలు తీసుకువచ్చి వ్యాపారం చేశాను. ఆ పని చేసినన్ని రోజులూ ఏనాడూ నా కోసం రూపాయి కూడా తీసుకోలేదు. అదంతా కుటుంబ సేవగానే భావించాను. కానీ బయట ఎలా ఉన్నా ఇంటికెళ్లాక ఎప్పటిలాగే పరిస్థితి దారుణంగా ఉండేది.
ఒంటరి ప్రయాణంలో... వ్యవహారం చివరకు కొట్టడం వరకు వెళ్లింది. అప్పటికే ఇద్దరు పిల్లలున్నారు నాకు. చూస్తుండగానే 26 ఏళ్ల వివాహం జీవితం గడిచింది. అయినప్పటికీ దెబ్బలు తినటాన్ని భరించలేకపోయాను. అక్కడి నుంచి బయటపడిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ ఇంట్లో నా కంటూ ఏమీ మిగలలేదు. నా తరపున ఎవరూ మాట్లాడలేదు. కట్టుబట్టలతో నాన్న దగ్గరకు వెళ్లిపోయాను. నా పట్ల ఆయన అన్నిరకాల బాధ్యతలు నిర్వర్తించి ఉన్నారు. దాంతో వెళ్లాలా? వద్దా? అని సతమతమై గత్యంతరం లేనిపరిస్థితిలో ఆయన దగ్గరకే వెళ్లాను. మూడు నెలలు భారంగా గడిచాయి.
అప్పటికే చేనేత వస్త్రాలతో పరిచయం ఉండటంతో నాన్న దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకుని 2007లో 'అనఘ' చేనేత వస్త్రాల దుకాణం మొదలు పెట్టాను. పూర్వ పరిచయాల వల్ల లక్షల రూపాయల మెటీరియల్‌ను అప్పుగా ఇవ్వడానికి చేనేత కార్మికులు అంగీకరించారు.

ఇంటికి వెళితే వేదన చుట్టిముడుతుందని అనఘలోనే సమయమంతా గడిపేదాన్ని. రెండు సంవత్సరాల్లోనే నిలదొక్కుకుని ఫ్యాప్సీ ఉత్తమ ఔత్సాహిక మహిళ అవార్డుకు, ఐఎస్బీ వాళ్ల బిజినెస్మేనేజ్మెంట్ కోర్సుకు ఎంపికయ్యాను.
అమ్మాయిలకు ఆలంబన... నా దగ్గర ప్రస్తుతానికి ఇరవైమంది అమ్మాయిలు పనిచేస్తున్నారు. పెద్ద అర్హతలున్నవారికి వేరే ఉద్యోగాలు ఉన్నాయి. అందుకే నా దగ్గర ఉద్యోగం కావాలని వచ్చేవారి అర్హతలు తక్కువ ఉన్నా పట్టించుకోను. పని పట్ల వారి ఇష్టాన్నేచూస్తాను. అలా అని కేవలం పని చూసి ఊరుకోను. అమ్మాయిలకు ఆర్థిక స్వేచ్ఛ అవసరమని చెప్పి వాళ్ల జీతంలో ఎంతో కొంత సేవింగ్ చేయిస్తాను.
వాళ్లు సేవింగ్ చేస్తున్నారా? లేదా? అని ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటాను కూడా. అమ్మాయిల జీవితం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో తెలియదు కాబట్టి, వారికి ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక ప్రణాళిక అవసరమనుకుంటాను. ఇలాంటి ప్రణాళిక ఉండబట్టే కొద్దికాలంలోనే నా పిల్లలకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చగలిగాను. ఇప్పటికీ వారికి ఏది అవసరమైనా నేనే చూసుకుంటాను.

రేపటి ఉదయం కోసం... ఈరోజుతోనే అంతా సమాప్తం కాదు. అందుకు నా జీవితమే పెద్ద ఉదాహరణ అనుకుంటాను. ఏం చేయాలో తోచని పరిస్థితిలో అనఘ మొదలు పెట్టిన నేను అనుకోకుండానే షబానా అజ్మీ నటించిన "మార్నింగ్ రాగ'' సినిమాకు తొలిసారి కాస్ట్యూమ్స్ అందించాను. తరువాత దర్శకుడు వంశీ "ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు'', "దొంగరాముడు అండ్ పార్టీ'' సినిమాల కోసం, అలాగే శేఖర్ కమ్ముల తన "లీడర్, ఆనంద్'' సినిమాలకు, ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో హీరోయిన్స్‌కు కాస్ట్యూమ్స్ ఇచ్చాను. కొన్ని సినిమాల్లో తల్లి పాత్రలకు నన్ను తీసుకున్నారు కూడా. ఇలాంటివన్నీ సరదా వ్యాపకాల్లాంటివి. మంచి చేనేత వస్త్రాల నందించడమే నాకు ప్రధానం. అందుకే చాలామంది ప్రముఖులు చేనేత వస్త్రాల కోసం నన్నే సంప్రదిస్తారు. ఆ తృప్తి ఒక్కటి చాలు నాకు.
- Andhra Jyothi Daily

వరిగడ్డి, వెదురుకర్ర, ఈతాకు, జొన్నఈనెలు, చిప్పెరకంకి, తుంగలతో
వ్యవసాయానికి వాడే పరికరాలను ఎన్నో తయారుచేశారు చీరాలకు చెందిన మువ్వా
చినకృష్ణమూర్తి. ఇందుకు ఆయన జాతీయ స్థాయిలో ఆదర్శరైతుగా ఎంపికయ్యారు కూడా.
ఇవే కాకుండా ఈయన వరిగడ్డితో చీర, రవికె, హ్యాండ్‌బ్యాగులు కూడా
తయారుచేశారు. వరిగడ్డితో ఇన్ని వస్తువులా అని మనం ఆశ్చర్యపోవడం సహజం. అదెలా
సాధ్యమైందో ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలా వినూత్నంగా వస్తువులు రూపొందించాలనే ఆలోచన 1959లో వీరన్నపాలెంలో జరిగిన
పశుప్రదర్శన చూసినపుడు మొదటిసారి కలిగింది. అప్పుడు నేను
కొమ్మర్నేనివారిపాలెంలో ఉండేవాడ్ని. ఆ ప్రదర్శన చూసినపుడు ఇది పశువుల
ప్రదర్శనకే పరిమితమా లేక రైతులు భిన్నంగా ఏవైనా తయారుచేసినా ఇందులో
ప్రదర్శించొచ్చా అనే సందేహం కలిగింది. అక్కడే ఉన్న పశువైద్యులు ఉమా
నాగేశ్వరరావు, రామచంద్రారెడ్డి గార్ల వద్ద నాకొచ్చిన సందేహాన్ని వ్యక్తం
చేశాను.
మగ్గం వాడకుండానే...
కత్తెర పెట్టకుండా ఎద్దుకి చిక్కాలను అల్లినట్టు రవికె అల్లాను. నాలుగు
గజాల ఈ చీరను ప్రదర్శనలో ఉంచితే నేత చీర అనుకున్నారు చాలామంది మహిళలు.
చేత్తో ముట్టుకుని చూస్తేనే కాని అది గడ్డితో తయారైందనే విషయం తెలియలేదు.
పొట్టకూటికోసం పొలం పని, పశుపోషణ చేస్తున్న నాకు కళాకారులకు ఇచ్చే పింఛన్
ఇస్తే మరిన్ని కళారూపాలను తయారుచేయగలను'' అని చెప్పారు చినకృష్ణమూర్తి.
చుట్టూ వందల ఎకరాల్లో విస్తరించిన పచ్చని తోటలు, నగరం నీడ లేని ప్రశాంత
వాతావరణం, నిరాడంబరమైన రెండు గదుల నివాసం - వెరసి మనం వచ్చింది గొప్ప
పేరుప్రఖ్యాతులున్న ఒక సంగీత విద్వాంసుడి దగ్గరకేనా - అనే అనుమానం
కలుగుతుంది 

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అంతరంగం కొన్ని సందర్భాల్లో ఆయనకు అత్యంత సన్నిహితులకు సైతం అందదు. ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో దాని బాధ్యత అంతా ఆయనదే. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టు కట్టినా, కేంద్రంలో మంత్రిగా పని చేసి తర్వాత రాజీనామా చేసినా, కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేయటం కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలందరితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు కారకుడైనా.. అలాంటి.. ఎలాంటి సంచలన నిర్ణయాలన్నీ ఆయనవే. అసలు కేసీఆరే ఓ సంచలనం. టిఆర్ఎస్లో వాటిని ప్రశ్నించే వారూ ఉండరు, వ్యతిరేకించేవారు అంతకన్న ఉండరు. తన ఆలోచనలను ఆయన పంచుకుంటారు, అలా పంచుకున్నప్పుడే తన నిర్ణయం సరైనదని అవతలివారు అనుకునేలా ఒప్పిస్తారు. ఇదీ కెసిఆర్ దగ్గర ఉన్న మెళకువ. రాజకీయ చతురత. ఇతరులను ఒప్పించి, మెప్పించడం ఓ కళ. ఆ కళలో కేసీఆర్ నిష్ణాతుడు. మహాకూటమిని సమర్థించి అందులో చేరినా, ఆ తర్వాత అదే కూటమిని తూర్పాపట్టినా, గత ఎన్నికల్లో అదే టీడీపీని ఓడించేందుకు కాంగ్రెస్‌తో చేతులు కలిపినా.. అందుకు ఓ లాజిక్కు చెబుతారు. ఆ తత్వం అందరికీ నిజమేననిపిస్తుంది. దటీజ్ కేసీఆర్!
వెనుకబడిన మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న జన్మించిన కెసిఆర్, తెలుగు సాహిత్యంలో ఎంఎ పట్టా అందుకున్నారు. 1982లో రాఘవాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) అధ్యక్షుడుగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అదే సంవత్సరం రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా పని చేశారు. 1985లో తొలిసారి సిద్దిపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన కెసిఆర్, ఆరు పర్యాయాలు అక్కడ ప్రాతినిధ్యం వహించారు. 2001-02లో తెలుగుదేశం పార్టీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి సిద్దిపేట నుంచే 58,000 వోట్ల మెజారిటీతో అఖండ విజయం నమోదు చేశారు. 2004లో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి ఎన్నికయ్యారు. 2006లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, యుపిఎ కూటమికి మద్దతు ఉపసంహరించి ఉప ఎన్నికల బరిలో దిగి రెండు లక్షల వోట్లకు పైగా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. గత ఏడాది ఎమ్మెల్యేలతో పాటు తాను, మరో ఎంపీ వినోద్ కుమార్ రాజీనామా చేసి మరోసారి లోక్‌సభలో అడుగు పెట్టారు. ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కరవు నివారణ మంత్రిగా, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా, యుపిఎ కూటమిలో కేంద్ర కార్మిక మంత్రిగా పని చేశారు. తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడుగా, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా, రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు.
సాహిత్యంలో ఎంఎ పట్టా పుచ్చుకున్న కెసిఆర్, ఎంత పని ఒత్తిడిలో అయినా రోజుకు కనీసం రెండు, మూడు పుస్తకాలు చదవకుండా ఉండరని ఆయన సన్నిహితులు చెబుతారు. ప్రముఖ కవి నందిని సిధారెడ్డి సహాధ్యాయి అయిన ఆయన ఏ అంశం అయినా కూలంకషంగా అధ్యయనం చేయనిదే మాట్లాడరు. ఆయన ఉపన్యాసాల్లో అయినా, మామూలుగా మాట్లాడేటప్పుడైనా దొర్లే సూక్తులు, సామెతలు అన్నీ ఆయన పఠనానుశీలత నుంచి జాలువారినవే. తెలంగాణ ప్రాంతంపై ఇతరులెవరైనా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తే, ఆంధ్ర ప్రాంత మహాకవి శ్రీనాథుడి పద్యాలే కెసిఆర్ జవాబులకు ములుగర్రలు. పల్నాడు వెనుకబాటు తనాన్ని శ్రీనాథుడెలా వర్ణించిందీ కెసిఆర్ ప్రతిపదార్థ తాత్పర్యంతో విడమరచి చెబుతారు.పార్టీని స్థాపించే ముందు తెలంగాణ చరిత్రను కూలంకషంగా అధ్యయనం చేశారు. తెలియని విషయాలను నిపుణులతో చర్చించి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర జలసంఘంలో పని చేసిన ఆర్. విద్యా సాగరరావు, ఇతర నిపుణులతో నిరంతరం చర్చలు జరిపి విషయావగాహన పెంచుకున్నారు. అందుకే అంత సాధికారికంగా ఆయన ప్రసంగాలుంటాయి. తెలంగాణ చారిత్రక సంస్కృతీ విశేషాలు, పండుగలు, పబ్బాలు ఇలా దేన్నీ విడవకుండా లోతుగా తెలుసుకోవటం కెసిఆర్‌కు ఉన్న మంచి అలవాటు అని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. ఎన్నికలు వచ్చే సమయాల్లో కెసిఆర్ పార్టీ నిర్మాణంలో మునిగిపోతారు. ఎన్నికల్లో పొత్తులు అనివార్యమని అందరికీ తెలిసినా ఎవరితో జట్టు కడతారో సహచరులు చివరి క్షణం వరకూ చెప్పలేరు. తాను చేసింది, తీసుకున్నదీ తప్పని తేలినా దానిని సైతం ఒప్పని వాదించే నేర్పు-ఓర్పు కేసీఆర్ సొంతం.
కేసీఆర్ సహా అంతా ఈయనను గురుతుల్యుడుగా భావిస్తుంటారు. కీలకమైన అంశాల్లో కేసీఆర్ ఈయనతో చర్చిస్తుంటారు. టీఆర్ఎస్ సిద్ధాంతకర్త అన్న పేరు ఉన్నప్పటికీ అసలు సిసలు సిద్ధాంతకర్త కేసీఆరే. మొదటి నుంచీ మీడియాలో ఆవిధంగా ప్రచారంలోకి రావడంతో ఇప్పటికీ అదే భావన కొనసాగుతోంది. ప్రైవేటు సంభాషణలో మాత్రం జయశంకర్‌ను సిద్ధాంతకర్తగా కేసీఆర్ అంగీకరించరన్నది నేతల మాట. కానీ, కేసీఆర్‌కు నచ్చచెప్పగల స్థాయి, చొరవ జయశంకర్‌కు ఉంది. కేసీఆర్ తర్వాత స్థాయి నాయకులు మాత్రం జయశంకర్‌కు అత్యంత గౌరవం ఇస్తారు.
కేసీఆర్ మనస్ఫూర్తిగా విశ్వసించే అతికొద్ది మంది నేతల్లో కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఒకరు. కేసీఆర్ వరంగల్‌కు వెళితే కెప్టెన్ సాబ్ ఇంట్లోనే తిండి, బస. టీఆర్ఎస్.. కాంగ్రెస్ సర్కారులో చేరినప్పుడు కెప్టెన్‌కు మంత్రి పదవి ఇప్పించారు. ఆయన కేసీఆర్ ఆదేశాలను జవదాటరు. ఒకరకంగా పార్టీకి మూలస్తంభం. ఆర్ధిక వ్యవహారాల్లో పార్టీకి దన్నుగా ఉంటారు. ఆర్థికపరమైన అంశాలన్నీ కెప్టెనే భుజాన వేసుకుంటారు. వివాదరహిత ముద్ర.
కేసీఆర్ మేనల్లుడిగా తెరపైకి వచ్చినప్పటికీ ఆ తర్వాత తన సత్తా ఏమిటో నిరూపించుకున్న యువ నేత. ఒక్కమాటలో చెప్పాలంటే.. సిద్దిపేటలో ఇప్పుడు కేసీఆర్ కన్నా ఎక్కువ ఇమేజ్ ఉన్న నేతగా అవతరించారు. ప్రజలు, పార్టీ శ్రేణులతో మమేకం అయ్యే నేత. యువతలో హరీష్‌కు మంచి పట్టు ఉంది. క్షేత్రస్థాయిలో యువత, శ్రేణులను సమీకరించి, ప్రత్యర్థులకు చెమటలు పట్టించగలిగే స్థాయి ఉన్న వ్యూహరచయిత. కేసీఆర్‌తో వాదించే శక్తి ఉన్న నేత. పార్టీలో తనకంటూ ప్రత్యేక వర్గం ఉన్న ఏకైక నేత ఆయనొక్కరే. కేసీఆర్ తీసుకునే కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్రధారి. హరీష్ ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం దుర్లభం. హరీష్‌కు అసంతృప్తి రాకుండా కేసీఆర్ సైతం జాగ్రత్త పడుతుంటారు. ఆయన వర్గానికి సరైన ప్రాధాన్యం ఇస్తుంటారు.
కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తులైన నేతల్లో ఈయనొకరు. ఆయనకు నచ్చచెప్పగలిగే కొద్దిమంది నేతలో నాయని ఒకరు. ‘నర్సన్నా’ అని ఆప్యాయంగా పిలిచే కేసీఆర్‌కు ఆయనపై ఎనలేని నమ్మకం. అందుకే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజు మినహా.. మిగిలిన అన్ని సందర్భాల్లో నాయని తోనే పార్టీ జెండా ఎగురవేయిస్తుం టారు. 
అధినేతకు విధేయుడు. పార్టీ విధానాన్ని గట్టిగా వినిపించే నేత. కేసీఆర్ సైతం ఆయనను విశ్వసిస్తుంటారు. పార్టీ వాణిని చానెళ్ల ద్వారా సమర్ధవంతంగా వినిపించడంతో పాటు, ప్రత్యర్థుల విమర్శలను అంతే సమర్థవంతంగా తిప్పికొట్టగల నేత.
రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ప్రముఖుల కుటుంబాలకు చెందిన వ్యక్తులు రాణిస్తున్న సంఘటనలు స్వల్పమే. తండ్రి సీఎం అయితే కొడుకులు ఆ స్థాయిలో రాణించిన సందర్భాలు లేవు. కానీ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం మాత్రం దీనికి పూర్తి భిన్నం. మొదట అందరి మాదిరిగా కేసీఆర్ కొడుకు, కూతురుగానే రాజకీయాల్లో కాలుపెట్టినప్పటికీ.. ఆ తర్వాత ఆ హోదాతోనే గుర్తింపు తెచ్చుకోకుండా.. స్వంత ప్రతిభతో రాణిస్తున్న కేటీఆర్, కవిత ఇప్పుడు స్వతంత్ర హోదాతో గుర్తింపు పొందుతున్నారు. ఇద్దరూ విదేశాల్లోనే చదివి, అక్కడే ఉద్యోగాలు చేసి వచ్చినప్పటికీ ఇక్కడి జనాల అంతరంగం, భాష, సంస్కృతితో మమేకమయిన కేటీఆర్, కవిత తెలంగాణ ప్రజానీకంలో తమకంటూ స్వంత ఒరవడి, గుర్తింపు సృష్టించుకున్నారు. తండ్రి మాదిరిగానే పుస్తకాలు చదివి విషయజ్ఞానం పెంచుకున్నారు.
అచ్చ తెలంగాణ యాసతో ఇద్దరూ తెలంగాణ ప్రజలకు చేరువయ్యారు. అధినేత వారసులుగా ఉన్నప్పటికీ, ఆ ముద్రకే పరిమితం కాకుండా కష్టపడి ప్రజల్లోకి వెళ్లి, ఉద్యమాల ద్వారా గుర్తింపు సాధించారు. కేటీఆర్ తన తొలి ఎన్నికలో సిరిసిల్లలో అత్తెసరు మెజారిటీతో గెలిచినప్పటికీ, పట్టువిదలని విక్రమార్కుడిలా పనిచేసి రెండోసారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రతి ఆందోళన కార్యక్రమాల్లోనూ ముందుండి వాటిని నడిపిస్తు న్నారు. అటు కవిత సైతం ఉద్యమ సమయంలో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకు న్నారు. బతుకమ్మ పండుగ శతాబ్దాల నుంచి ఉన్నప్ప టికీ.. కేవలం కవిత ద్వారానే దానికి ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది. ఆ పండుగ ప్రాశస్త్యం వివరించేందుకు ఆమె గల్లీ నుంచి ఢిల్లీ వరకూ కార్యక్రమాలు చేపట్టారు. మహిళలను మమేకం చేసి, ఆ పండుగ ప్రత్యేకతను స్కూళ్ల వరకూ విస్తరింప చేశారు. తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, జీవన విధానంపై పుస్తకాలు సైతం ముద్రించడం, తెలంగాణ సంస్కృతిని ఈ తరాలు మర్చిపో కుండా ఉండేందుకు జిల్లాల్లో పర్యటనలు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో కవిత తానేమిటో నిరూపించుకున్నారు. రానున్న ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసే స్థాయికి ఎదిగారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ నుండి హైదరాబాద్ వరకు ప్రతి ఒక్కరి హృదయాల్లో తెలంగాణ వాదం నాటుకుపోయింది. పట్టణాలు పల్లెలు అంటూ ఎక్కడా వ్యత్యాసం లేదు. దుబాయిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం టిఆర్ఎస్ ద్వారానే సిద్ధిస్తుందని భావిస్తున్నారు. పార్టీ సైతం ఏకైక ఎజెండాతో ముందుకు సాగుతోంది.